Thursday, July 9, 2026 11:56 AM
Thursday, July 9, 2026 11:56 AM

మధ్య తరగతికి ఇల్లు కష్టమేనా..?

భారత రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న జోరుకు బ్రేకులు పడ్డాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో సొంతిల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ధరల భారం గుదిబండగా మారిందని జాతీయ మీడియా సంచలన విషయాలు బయటపెట్టింది. తాజా నివేదికల ప్రకారం, దేశంలోని టాప్-7 నగరాలైన ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతాలలో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6 శాతం మేర క్షీణించాయని పేర్కొంది.

Also Read : దమ్ముంటే రండి.. అఖిల ప్రియ సంచలనం..!

గృహాల ధరలు సామాన్యుడి ఆదాయానికి మించి పెరిగిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ తగ్గనప్పటికీ, కొనుగోలు శక్తి లోపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఇళ్లను పక్కనబెట్టి, కేవలం అధిక లాభాలు తెచ్చిపెట్టే లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనివల్ల మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఇళ్ల సంఖ్య 7 శాతం పెరిగి 1.06 లక్షల యూనిట్లకు చేరినప్పటికీ, అందులో మధ్యతరగతి కొనుగోలు చేయగలిగే గృహాలు చాలా తక్కువగా ఉంటున్నాయి.

Also Read : నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన సూపర్ సక్సెస్..!

ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్న కుటుంబాలు కూడా నగరాల్లో అప్పులపాలు కాకుండా ఇల్లు కొనలేని దుస్థితి ఏర్పడింది. ఒకవైపు విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయం, మరోవైపు పెరిగిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు, వీటికి తోడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మధ్యతరగతి జీవులను కుదేలు చేస్తున్నాయి. ఈ ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది కొనుగోలుదారులు తమ సొంతింటి నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు, లేదా నగర శివార్లకు వెళ్ళిపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం సుస్థిరమైన వృద్ధిని సాధించాలంటే కేవలం ధనికుల కోసమే కాకుండా, మెజారిటీ ప్రజలైన మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అందుబాటు ధరల గృహాల నిర్వచనాన్ని మార్చడంతో పాటు, రాయితీలు కల్పించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఆసక్తి రేపుతోన్న జనసేన...

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న...

దమ్ముంటే రండి.. అఖిల...

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా,...

నారా లోకేష్ దక్షిణ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్, హైటెక్ సెమీకండక్టర్...

ఏపీలో మన మిత్ర...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవల సరళీకరణలో...

షాకింగ్: నల్లమలలో అమరావతి...

నల్లమల అటవీ ప్రాంతంలో అమరావతి చారిత్రక...

మాట నిలబెట్టుకున్న కూటమి...

ఏపీలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు...

పోల్స్