Saturday, September 19, 2026 02:36 PM
Saturday, September 19, 2026 02:36 PM

స్టాక్ మార్కెట్ లో హెరిటేజ్ దూకుడు.. ఒక్కరోజులో భువనేశ్వరి లాభం ఎంతంటే..?

ఇటీవల కాస్త నష్టాలతో ఇబ్బంది పడిన హెరిటేజ్ మళ్ళీ లాభాల పట్టింది. నారా భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్, భారీ లాభాలను అర్జించినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. స్టాక్ మార్కెట్‌లో షేర్ వాల్యూ పెరగడంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు ఒకే రోజులో 7% పైగా పెరిగాయి. దీనితో రూ. 79 కోట్లు సంపద పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గాయని హెరిటేజ్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా షేర్ వాల్యూ పెరగడంతో భారీ లాభాలు అర్జించింది.

Also Read : అమ్మో గాయాలు.. భారత్ కు షాక్ ల మీద షాక్ లు

ప్రముఖ డైరీ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్, ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి క్వార్టర్ లో రూ.40.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.58.4 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 30.7% తగ్గుదలగా కంపెనీ పేర్కొంది. లాభాలు తగ్గినప్పటికీ, కంపెనీ స్టాక్ రూ.493.25కి చేరుకోవడంతో పెట్టుబడిదారులకు లాభం చేకూర్చింది. దీనితో నారా భువనేశ్వరి ఎక్కువగా లాభపడ్డారు. సంస్థలో ఆమె వాటాలు ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున సంపద పెరిగింది.

Also Read : మిథున్ రెడ్డినే అరెస్ట్ అంటే.. మరి మా సంగతి..? వైసీపీలో భయం భయం

హెరిటేజ్ ఫుడ్స్ లో ఆమెకు 2.26 కోట్ల షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీలో దాదాపు 24.37% శాతం వాటాలు ఆమెకు ఉన్నాయి. ఒక్క రోజులో షేర్ వాల్యూ భారీగా పెరగడంతో రూ. 79 కోట్లు భువనేశ్వరి సంపద పెరిగింది. చంద్రబాబు కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్‌లో 35.71% వాటా ఉంది. రాజకీయ పరంగా సంస్థ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. డైరీ ఉత్పత్తులలో భారీ ఆఫర్లు కూడా కంపెనీకి కలిసి వచ్చాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్