Monday, August 10, 2026 05:29 PM
Monday, August 10, 2026 05:29 PM

40 ఏళ్ళ మహిళల ఆరోగ్యానికి చిట్కాలు..!

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ.. మహిళల్లో ఏదోక శారీరక మార్పులు చూస్తూనే ఉంటాం. ,ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత, మహిళలు తరచుగా అనేక శారీరక మార్పులను ఎదుర్కొంటారు. శక్తిలో మార్పులు రావడం, హార్మోన్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఉండటం వంటివి, ఎముకలలో బలం తగ్గడం వంటివి చూస్తూనే ఉంటాం. వైద్య నిపుణులు, పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సప్లిమెంట్లు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర ఉంటే సాధారణ ఆరోగ్యం బాగుంటుంది.

Also Read  : సిగ్గు సిగ్గు.. జగన్‌ పరామర్శకు ఇవేనా అర్హతలు..?

చర్మవ్యాధి నిపుణురాలు గుర్వీన్ వారాయిచ్ గరేకర్ తన 40 ఏళ్ల వయసులో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ను కాపాడుకోవడానికి తాను తీసుకునే ఐదు సప్లిమెంట్లను వివరించారు. వృద్ధాప్యంతో పాటు వచ్చే శారీరక మార్పులను ఎదుర్కొంటూనే తన బలాన్ని, శక్తిని కాపాడుకోవడానికి ఆమె వాటిని తన రోజువారీ దినచర్యలో భాగం చేసినట్టు తెలిపింది. రాత్రి భోజనం తర్వాత మెగ్నీషియం గ్లైసినేట్, ముఖ్యంగా న్యూట్రోవా నుండి ఎంజీడీ 3, తీసుకుంటానని గరేకర్ చెప్పుకొచ్చారు.

మెగ్నీషియం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది, తిమ్మిరిని కూడా తగ్గిస్తుంది. కండరాల పనితీరుకు కూడా సహాయ పడుతుంది. 40 ఏళ్ల తర్వాత, ముఖ్యంగా హార్మోన్ల మార్పుల కారణంగా మహిళల ఎముకల ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంది. ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత సెంట్రమ్ నుండి కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్ అయిన ఆస్టోకాల్షియం తాను తీసుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. విటమిన్ డి శరీర కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందట. కాల్షియం ఎముక బలాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

Also Read  : రెండు పాత్రల్లో నట సింహం గర్జన..? బాలయ్యను వాడేస్తున్న డైరెక్టర్..!

గుండె మరియు మెదడు ఆరోగ్యానికి ఒమేగా-3 ఎంతగానో పని చేస్తుందని.. న్యూట్రోవా ఒమేగా-3 సప్లిమెంట్ క్యాప్సూల్స్, దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ ను నియంత్రించడంలో, కీళ్ల ఆరోగ్యాన్ని నియంత్రించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక వ్యాయామం తర్వాత ప్రోటీన్ ఆహారం తీసుకోవడం మంచిది అని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మెట్రో రైల్ కూతకు...

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు...

దామచర్లపై బాలినేని మరోసారి...

ఒంగోలు రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా...

విమర్శలకు చెక్ పెట్టడంలో...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీలో అవతల జరిగాయని...

ఏపి పోలీసుల పై...

ఏపీ పారిశ్రామికా శాఖ మంత్రి టి.జి....

స్థానిక పోరు.. రణమా.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

ఒంగోలు పాలిటిక్స్‌లో కూటమి...

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమికి చెందిన ఇద్దరు...

పోల్స్