గతంలో.. సోషల్ మీడియాలో హిందూ సమాజ వీడియోలకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. యువత కూడా అంత ఆసక్తిగా చూసే పరిస్థితి ఉండదు. కానీ గత 5 ఏళ్ళుగా పరిస్థితి వేగంగా మారింది. సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతోన్న వీడియోలకు మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఓ వీడియోను ఏకంగా 500 కోట్ల మంది వీక్షించారు. సాధారణంగా ఫేమస్ మ్యూజిక్ స్టార్ లు, సినిమా వాళ్లకు ఈ తరహాలో వ్యూస్ వస్తూ ఉంటాయి. యూత్ ను ఆకట్టుకునే ఇంగ్లీష్ వీడియోలు ఈ రేంజ్ లో ఫేమస్ అవుతూ ఉంటాయి.
Also Read : ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?
కానీ హనుమాన్ చాలీసా వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. టీ – సిరీస్ వ్యవస్థాపకుడు దివంగత గుల్షన్ కుమార్ నటించగా.. హరిహరన్ పాడిన శ్రీ హనుమాన్ చాలీసా, 14 ఏళ్ళ క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. ఇప్పుడు ఈ వీడియో ఇండియాలో ఉన్న అన్ని వీడియోలను డామినేట్ చేసింది. ఈ భక్తి గీతం మే 10, 2011న ఆన్‌లైన్ లో అప్లోడ్ అయింది.
Also Read : అది గంభీర్ గొప్ప కాదు.. కడిగి పారేసిన మాజీ క్రికెటర్..!
5,006,713,956 మంది ఈ వీడియోను ఇప్పటి వరకు చూసారు. హరిహరన్ గానం, లలిత్ సేన్ కూర్పు హనుమాన్ చాలీసాకు హైలెట్ గా చెప్పవచ్చు. ఇతర భారత వీడియోలు 2 బిలియన్ల వరకు వీక్షణలు పొందాయి. ఇప్పటివరకు, దేశంలో అత్యధికంగా వీక్షించబడిన వీడియోగా శ్రీ హనుమాన్ చాలీసా నిలిచింది. ఫేస్బుక్ సహా ఇతర మాధ్యమాల్లో కూడా ఈ వీడియో రీల్స్ వైరల్ అవుతూ ఉంటాయి. టీ – సిరీస్ యూట్యూబ్ ఛానల్ 2019 మేలో 100 మిలియన్ల సబ్‌స్క్రైబర్ లు సాధించిన మొదటి వీడియోగా నిలిచింది. ప్రస్తుతం టి-సిరీస్ సబ్‌స్క్రైబర్ లు 307 మిలియన్లు.

