Thursday, May 7, 2026 04:01 AM
Thursday, May 7, 2026 04:01 AM

అది గంభీర్ గొప్ప కాదు.. కడిగి పారేసిన మాజీ క్రికెటర్..!

ప్రత్యర్ధులకు దుర్బేధ్యంగా కనపడిన భారత ఉపఖండం మైదానాల కోటలు ఒక్కొక్కటి కూలుతున్నాయి. ఏళ్ళ తరబడి సమిష్టి కృషితో నిర్మించిన కోటలు తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్నాయి. భారత్ లో సీరీస్ గెలవడం సేనా దేశాలకు సైతం కలే. అలాంటిది వైట్ వాష్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. రెండు సేనా దేశాలు.. గత ఏడాది కాలంలో భారత్ ను వైట్ వాష్ చేసాయి. గత ఏడాది న్యూజిలాండ్, ఈ ఏడాది సౌత్ ఆఫ్రికా.. భారత టెస్ట్ జట్టును ఊహించని దెబ్బ కొట్టాయి.

Also Read : శివజ్యోతికి టీటీడీ షాక్.. శభాష్ అంటున్న భక్తులు..

దీనితో మాజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన కామెంట్స్ చేసాడు. నిజం చెప్పాలంటే, భారత్ ఓడిపోవాలని రాసి పెట్టి ఉంది. క్రికెట్ లో పరిస్థితులు సరిగా లేవని తనకు తెలుసు అంటూ కామెంట్ చేసాడు. ఒక పక్కా వ్యూహం గాని, ప్రణాళిక గాని లేవని, అనుసరించాల్సిన వ్యూహం సమర్ధవంతంగా లేదని మండిపడ్డాడు. మార్పులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో, న్యూజిలాండ్‌తో జరిగిన హోమ్ సిరీస్‌ లో, ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ స్పష్టంగా కనపడిందని కామెంట్ చేసాడు.

Also Read : ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?

ఖచ్చితంగా.. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అసలు భారత్ కు కోచ్ ఉండాలా లేదా నిర్ణయం తీసుకోవాలని, భారత టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి వారు ఈ నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ సీరీస్ ను డ్రా చేసుకోవడంపై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మనోజ్ తివారి మండిపడ్డాడు. గంభీర్ ఇంగ్లాండ్‌లో యువ జట్టుతో సిరీస్ డ్రా చేసుకున్నానని చెబుతున్నాడని.. తన అభిప్రాయం ప్రకారం, ఇంగ్లాండ్ సిరీస్ డ్రా మనకు గొప్ప విషయం కాదన్నాడు. అది మంచి ఫలితం కాదని, చివరి రోజున ఇంగ్లాండ్ ఎక్కువ షాట్లు ఆడటం ద్వారా ఇంగ్లాండ్ తప్పు చేసిందని.. వారు సిరీస్‌ను 3-1తో సులభంగా గెలుచుకునేవారని.. అసలు గంభీర్ కోచ్ అయిన తర్వాత గొప్ప విజయాలు ఏమీ లేవన్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్