Wednesday, August 5, 2026 03:17 PM
Wednesday, August 5, 2026 03:17 PM

ఇమ్రాన్ బ్రతికే ఉన్నారా..? పాక్ రక్షణ శాఖ ఏం అంటోంది..?

దశాబ్దాలుగా పాకిస్తాన్ లో కొనసాగుతున్న ఓ దుష్ట సాంప్రదాయం ఇప్పుడు ఆందోళనలకు దారి తీస్తోంది. అధ్యక్షులుగా పని చేసిన వారిని ఏదోక ఆరోపణలతో ఇబ్బంది పెట్టే ఆ దేశం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విషయంలో కూడా అదే వైఖరి ప్రదర్శిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు రావల్పిండి జైలులో హత్యకు గురయ్యారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ఆయనను హతమార్చాలని ప్రభుత్వం, ఆర్మీ ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : శివజ్యోతికి టీటీడీ షాక్.. శభాష్ అంటున్న భక్తులు..

ఆయనను ఉంచిన జైలు వద్ద కూడా నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రావల్పిండిలో ఆయనను ఉంచిన జైలు వద్ద నిరసనను ఆయన మద్దతుదారులు విరమించారు. ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, అడియాలా జైలు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు కుటుంబసభ్యులను జైలు అధికారులు అనుమతి ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ, డిసెంబర్‌ 2న ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు.

Also Read : విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!

ఇమ్రాన్‌ఖాన్‌ను మరో జైలుకు తరలించారన్న వార్తలను ఖండిoచిన జైలు అధికారులు.. ఆయన క్షేమంగా ఉన్నారని ప్రకటించారు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కంటే మెరుగైన ఆహారం ఇమ్రాన్‌ ఖాన్‌ కు అందుతోందని, పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. కస్టడీలో ఇమ్రాన్‌ ఖాన్‌ కు ప్రత్యేక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. టెలివిజన్‌లో ఏ ఛానల్‌ అయినా చూసుకునే సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. వ్యాయామానికి కూడా యంత్రాలు సమకూర్చామని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్