Saturday, September 19, 2026 08:16 PM
Saturday, September 19, 2026 08:16 PM

ఆ కేసు బోగస్.. చంద్రబాబుకు గుడ్ న్యూస్..!

ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు సంచలనంగా మారిన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయింది. అప్పటి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ సర్కార్.. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు చేసింది. కానీ తాజాగా ఈ కేసులో ఏ విధమైన అక్రమాలు లేవని సిఐడీ అధికారులు నిర్ధారించి కేసు క్లోజ్ చేసారు. ఏసీబీ కోర్ట్ కు ఈ మేరకు నివేదిక సమర్పించారు. కేసు క్లోజ్ చేయడంతో.. సిఎం చంద్రబాబు సహా మరో 15 మందికి ఊరట లభించినట్లు అయింది.

Also Read : తిత్తి తీస్తాం.. పవన్ సంచలన కామెంట్స్

అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఏ విధమైన ఆధారాలు తన వద్ద లేకపోవడంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలపడంతో.. కోర్ట్ లో అంగీకారం మేరకు కేసు క్లోజ్ చేసారు. ఒక్కసారి ఈ వ్యవహారం పూర్వాపరాలు చూస్తే.. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్‌ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారని, సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసారు.

Also Read : విభేదాల్లో కూడా సంస్కారమే.. ఓ మెట్టు ఎక్కిన లోకేష్..!

ఈ కేసు నమోదు అయిన రెండేళ్ళ తర్వాత అంటే.. 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరును చేర్చారు. భారత్‌ నెట్‌ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించారనే ఆరోపణలు రుజువు కాలేదు. దీనిపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపినా సరే ఆధారాలు లేకపోవడంతో.. అసలు అక్రమాలు జరగలేదు అని, ఆర్ధిక నష్టం జరగలేదని తేల్చారు. మధు సూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేయడంతో కేసు క్లోజ్ అయింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్