Saturday, September 19, 2026 09:15 PM
Saturday, September 19, 2026 09:15 PM

తిత్తి తీస్తాం.. పవన్ సంచలన కామెంట్స్

2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. సైలెంట్ అయిన ఆ పార్టీ నేతలు మళ్ళీ ఈ మధ్య కాలంలో దూకుడు పెంచారు. అధికార పార్టీ నేతలపై కాస్త రెచ్చగొట్టే ధోరణి కూడా ఆ పార్టీ నేతలు ప్రదర్శించడం వివాదాస్పదం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా కొందరు వైసీపీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో మళ్ళీ దూకుడు పెంచి విమర్శించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. దీనితో పోలీసులు కూడా వారిపై గురిపెట్టారు.

Also Read : కల సాకారం.. కానీ ఎన్నో అనుమానాలు..?

ఈ నేపధ్యంలో తాజాగా డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతల బూతులు, బుద్ధి మారడం లేదు అని పవన్ మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో క్లోజ్‌ గా మానిటరింగ్‌ చేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లకు వారి విధానంలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకులపై కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : భూమనను అడిగిన ప్రశ్నలు ఇవే..?

వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు, వాళ్లు ఆశలు పెట్టుకోవద్దని పవన్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నేతలకు కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కొన్నాళ్ళుగా పార్టీ నేతలపై క్షేత్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. నేతల నేరపూరిత వైఖరిని సహించేది లేదని పవన్ హెచ్చరించారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించను అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి నాయకులను వదులుకోవడానికి కూడా సిద్ధమేనని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్