Wednesday, August 5, 2026 06:36 PM
Wednesday, August 5, 2026 06:36 PM

ఎన్డియే వ్యూహంతో బిజెపిని మమత దెబ్బ కొడతారా..?

ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. బీహార్ ఎన్నికలతో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగిన నేపధ్యంలో.. వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక మరోసారి ముఖ్యమంత్రి కావాలని మమతా బెనర్జీ, ఎలాగైనా బెంగాల్ కోటలో పాగా వేయాలని కమలం పార్టీ తీవ్రంగా కసరత్తు మొదలుపెట్టారు. బిజెపి చేస్తున్న రాజకీయాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోన్న మమత.. తాజాగా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

Also Read : కల సాకారం.. కానీ ఎన్నో అనుమానాలు..?

ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 సీట్లలో 85 సీట్లు గెలుచుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. ఇప్పుడు ఆయన బాటలోనే మమతా బెనర్జీ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీనితో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉంది. మహిళలు తమ జీవనోపాధిని ఏర్పరచుకోవడానికి సహాయపడే పథకాన్ని నితీష్ ప్రారంభించారు. ఎన్నికల కోడ్ రాక ముందు.. 1.2 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ప్రభుత్వం నగదు బదిలీ చేసింది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ ఇలాంటి పథకాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. గత 15 ఏళ్ళలో మహిళను దృష్టిలో పెట్టుకుని మమత ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇదే మమతా బెనర్జీకి బలం చేకూర్చింది. ఇప్పుడు కూడా ఆమె 10 వేల రూపాయలను మహిళల ఖాతాల్లో వేసే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మమత 50,000 మంది మహిళలను లక్ష్మీర్ భండార్ పథకంలో చేర్చి, 60 ఏళ్లు పైబడిన మహిళలందరినీ పాత పెన్షన్ పథకానికి మార్చారు.

Also Read : మా ఓటమికి ఆమే కారణం..!

లక్ష్మీర్ భండార్ పథకం కింద, జనరల్ కేటగిరీలోని మహిళలు నెలకు రూ.1,000 పొందుతారు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారు నెలకు రూ.1,200 పొందుతారు. ఇది రాష్ట్రంలోని 2.2 కోట్లకు పైగా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జాగో ప్రాజెక్ట్ కింద, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.5,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆరోగ్య బీమా పథకం, స్వాస్థ్య సథి కింద, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజ్ అందిస్తారు. మహిళ ఈ పథకంలో కుటుంబ పెద్దగా ఉంటారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పార్లమెంట్ లో దుమ్మురేపిన...

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లు-2026...

తెలంగాణలో డయల్ 100కు...

తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజల నాడిలో,...

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

పోల్స్