Friday, October 2, 2026 01:02 PM
Friday, October 2, 2026 01:02 PM

వైసీపీ పెద్ద తలకాయలపై గురిపెట్టిన ఈడీ..!

2019 సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశంతో దర్యాప్తు అత్యంత వేగంగా మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సుదీర్ఘ కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈనెల 14వ తేదీన తమ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లలో ఈడీ స్పష్టం చేసింది.

Also Read : తాడేపల్లి టు ఢిల్లీ వయా సీపీఐ.. కాంగ్రెస్ కోసమే..?

సీబీఐ దర్యాప్తు ఒకవైపు సాగుతుండగానే, ఈ కేసులో పలువురు నిందితులను విచారించిన ఈడీ అధికారులు.. నేరుగా ఎంపీకి నోటీసులు ఇవ్వడంతో ఈ కేసులో తదుపరి ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ కేసులో తెర వెనుక పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఈడీ అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి దాదాపు రూ.40 కోట్ల మేర భారీ ఆర్థిక లావాదేవీలు, సుపారీ ఒప్పందాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Also Read : వారికి టికెట్లు లేవు.. పల్లా క్లారిటీ..!

ఈ భారీ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరి ఖాతాల్లోకి చేరింది, మరియు హవాలా మార్గాల ద్వారా ఏవైనా నిధులు బదిలీ అయ్యాయా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. హత్య వెనుక ఉన్న ఆర్థిక మూలాలను పూర్తిగా వెలికితీసి, మనీలాండరింగ్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. ఈ నోటీసులు జారీ చేయడానికి ముందు ఈడీ అధికారులు తెర వెనుక సుదీర్ఘమైన కసరత్తు నిర్వహించారు.

Also Read : వైసీపీ నేతలను వేటాడుతున్న ఈడీ..!

ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో పాటు అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరిని ఈడీ అధికారులు ఇటీవలే సుదీర్ఘంగా ప్రశ్నించి, వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. జైల్లో ఉన్న నిందితుల నుంచి రాబట్టిన కీలక సమాచారం, బ్యాంకు ఖాతాల విశ్లేషణ ఆధారంగానే తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డికి సమన్లు పంపినట్లు తెలుస్తోంది. ఈనెల 14న జరిగే విచారణలో ఎంపీని ఎదురుగా కూర్చోబెట్టి ఈ రూ.40 కోట్ల ఆర్థిక డీల్‌పై అధికారులు సునిశితంగా ప్రశ్నించే అవకాశం ఉండటంతో ఈ పరిణామం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ వెర్సస్ ఇండియా...

ఇటీవల నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్...

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

పోల్స్