Friday, October 2, 2026 01:03 PM
Friday, October 2, 2026 01:03 PM

వైసీపీ వెర్సస్ ఇండియా టుడే.. మేం పిలిచాం.. మీరే రాలేదు..!

ఇటీవల నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్-2026 సదస్సుకు సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇండియా టుడే సమాధానం ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక కాంక్లేవ్‌కు తమ పార్టీని ఆహ్వానించలేదంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం, ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు గుప్పించాయి. అయితే, ఈ ట్రోలింగ్‌పై, వైసీపీ చేస్తున్న విమర్శలపై ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అక్షిత నందగోపాల్ ఎక్స్ వేదికగా నేరుగా స్పందించి, పక్కా ఆధారాలతో గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also Read : వైసీపీ పెద్ద తలకాయలపై గురిపెట్టిన ఈడీ..!

వైసీపీ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. అక్షిత నందగోపాల్ తన ప్రకటనలో.. ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సుకు హాజరుకావాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అనేక సార్లు అధికారికంగా ఆహ్వానించామని వెల్లడించారు. తాము పిలవలేదనడం ముమ్మాటికీ అబద్ధమని, ఆహ్వానం పంపినప్పటికీ వైసీపీ నేతలే ఈ సదస్సుకు హాజరుకాలేదని ఆమె అసలు నిజం బయటపెట్టారు. దక్షిణ భారతదేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి తమ గళాన్ని, తమ వాదనను బలంగా వినిపించేందుకు ఈ కాంక్లేవ్ ఒక గొప్ప వేదికగా అవకాశం కల్పించిందని ఆమె వివరించారు.

Trolls On YS Jagan for not attending india today south conclave

Also Read : తాడేపల్లి టు ఢిల్లీ వయా సీపీఐ.. కాంగ్రెస్ కోసమే..?

కానీ వైసీపీ ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా తాము పిలవలేదంటూ బురదజల్లడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇండియా టుడే ఎడిటర్ అక్షిత చేసిన ఈ పోస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను తప్పుదోవ పట్టించడంలో, జవాబుదారీతనం గల ప్రశ్నల నుంచి పారిపోవడంలో వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని లోకేష్ విమర్శించారు. వాస్తవాలను, నిజాలను నిష్పక్షపాతంగా చెప్పే మీడియా సంస్థలను బెదిరించడం వైసీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా మీడియాను చూసి భయపడటం, అబద్ధాలు ప్రచారం చేయడం ఆ పార్టీకి మారదంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ పెద్ద తలకాయలపై...

2019 సంచలనం సృష్టించిన మాజీ మంత్రి...

తాడేపల్లి టు ఢిల్లీ...

ఏపీతో పాటుగా, జాతీయ స్థాయిలో రెండేళ్ళ...

వైసీపీ నేతలను వేటాడుతున్న...

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

BC రిజర్వేషన్లపై వైసీపీ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34...

బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు.....

భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర...

ఎస్ఐఆర్ పై బాంబు...

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా...

పోల్స్