Thursday, May 7, 2026 02:49 AM
Thursday, May 7, 2026 02:49 AM

స్టార్ క్రికెటర్ పెళ్ళి వాయిదాకు అదే కారణమా..?

మన దేశంలో ప్రముఖ వ్యక్తుల వివాహం అనగానే జనాల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. పెళ్లి గురించి వచ్చే వార్తలు, పెళ్లి తర్వాత సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగే హడావుడి అంతా ఇంతా కాదు. సాధారణ ప్రజల్లో కూడా ప్రముఖుల వ్యక్తిగత జీవితం విషయంలో తెలియని ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఇదే హడావుడి నడుస్తోంది. అతను మహిళా ఎంపీని వివాహం చేసుకుంటాడు అనే వార్త వచ్చిన దగ్గరి నుంచి జరిగే హడావుడి అంతా ఇంతా కాదు.

Also Read : గంభీర్ ఎరా.. కోచ్ సాబ్ గ్రేటెస్ట్ పెర్ఫామెన్స్

ఇక ఇప్పుడు అతని పెళ్లి వాయిదా పడింది అనే ప్రచారం ఒకటి జరుగుతోంది. దీనిపై కూడా సోషల్ మీడియా జనాలు ఓ రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిందని కొందరు, ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మరికొందరు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే దీనికి సంబంధించిన అసలు కారణం ఇప్పుడు బయటకు వచ్చింది. రింకు సింగ్ వివాహం.. ఎంపీ ప్రియా సరోజ్ తో నవంబర్ 19న వారణాసిలో జరగాల్సి ఉంది. జూన్ 8 న ఇద్దరి నిశ్చితార్ధం గ్రాండ్ గా నిర్వహించారు.

Also Read : కన్నప్పకు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?

కాని పెళ్లి వాయిదా పడింది అనే ప్రకటన వచ్చింది. రింకూ బిజీ షెడ్యూల్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. క్రికెట్ షెడ్యూల్ ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షెడ్యూల్ ప్రకారం.. భారత్.. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ లు ఆడనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుండి 18 వరకు గౌహతిలో జరుగుతుంది. దీనికి ముందు, అక్టోబర్ 19, నవంబర్ 8 మధ్య మూడు వన్డేలు, ఐదు టి 20ల కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. అందుకే పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఇక రింకూ భారత్ తరుపున రెండు వన్డేలు, 33 టి20 మ్యాచ్ లు ఆడాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్