Sunday, September 20, 2026 01:46 AM
Sunday, September 20, 2026 01:46 AM

నలుగురు మంత్రులపై సీఎం సీరియస్..?

ఏపీ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 44 అజెండా అంశాలతో ఏపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. 9500 కోట్ల రూపాయలతో 56 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు ప్రాజెక్టులను తీసుకొచ్చారు. అమరావతి లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్ లు, స్టాప్ క్వార్టర్ల నిర్మాణానికి ఆమోద ముద్ర ముద్రవేసింది క్యాబినెట్.

Also Read : దేవుడా.. టీటీడీలో మరో భారీ మోసం..!

కుప్పంలో పాలేరు నదిపై చెక్ డాంల నిర్వహణకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే క్యాబినెట్ సమావేశంలో నలుగురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాబినెట్ సమావేశానికి మంత్రులు ఆలస్యంగా రావడం పై సీరియస్ అయినా చంద్రబాబు.. గుమ్మడి సంధ్యారాణి, వాసంశెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి సహా మరో మంత్రిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఎలా అంటూ మండిపడ్డారు సీఎం. ఎన్నిసార్లు చెప్పాలని, వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలన ఉండాలని సూచించారు.

Also Read : రూటు మార్చేసిన అన్న.. మీడియా ముందుకు వాళ్ళే..!

గతంలో కూడా మంత్రులకు సమయపాలన విషయంలో చంద్రబాబు క్లాస్ పీకారు. కలెక్టర్ల సమావేశం సహాయ పలు కీలక సమీక్ష సమావేశాలకు మంత్రులు ఆలస్యంగా రావడం పై హెచ్చరికలు పంపినా సరే మంత్రుల తీరులో మాత్రం మార్పు రాలేదు. అలాగే గ్రీవెన్స్ పరిష్కారంలో మంత్రులు వేగంగా ఉండాలని, ఫైల్ క్లియరెన్స్ కు ఎక్కువ సమయం తీసుకోకూడదని సూచించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి సారించాలని, ఇన్చార్జి మంత్రులు జిల్లాల్లో పర్యటించాలి అంటూ సున్నితంగా హెచ్చరించారు సీఎం. గ్రీవెన్స్ ఫాలోఅప్ చేయకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం కావడంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్