Sunday, September 20, 2026 02:26 AM
Sunday, September 20, 2026 02:26 AM

రూటు మార్చేసిన అన్న.. మీడియా ముందుకు వాళ్ళే..!

వైసీపీ అనగానే చాలా మందికి కనపడేది, వినపడేది ఆ పార్టీ నాయకులు కొందరు చేసే చేష్టలు, మాట్లాడే మాటలు. రాజకీయంగా బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా సరే వారి వైఖరిలో గాని, స్టైల్ లో గాని మార్పు ఉండదు. ఎవరు ఎన్ని బూతులు మాట్లాడితే, ఎవరు ఎంత వివాదాస్పదంగా వ్యవహరిస్తే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది అంటారు విశ్లేషకులు. అందుకే కొడాలి నానీ, జోగి రమేష్, ఆర్కే రోజా, గోరంట్ల మాధవ్ వంటి వారు కీలక పదవులు అధిరోహించారు అనేది అక్షర సత్యం.

Also Read : సీనియర్ దూకుడుకు తెలుగు తమ్ముళ్ల బ్రేకులు

ఆ పార్టీ రాజకీయ చరిత్ర, భవిష్యత్తు మొత్తం ఈ తరహా నేతల అడుగులు, చప్పుళ్ళే కనపడతాయి, వినపడతాయి. 2024లో సౌండ్ కాస్త తగ్గి.. సినిమా స్లో మోషన్ లో నడుస్తున్నప్పటికీ.. ఛాన్స్ వస్తే చెలరేగిపోవడానికి రెడీగా ఉన్నారు ఎందరో. కానీ ఇప్పుడు రూట్ మార్చేందుకు అధినేత రెడీ అయ్యారు. వాళ్లకు రెస్ట్ ఇచ్చి.. సాఫ్ట్ క్యారెక్టర్ లను ప్రజలకు పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. సబ్జెక్ట్ ఉన్న నాయకులకు అధికార ప్రతినిధి పదవులు, ఇతర కీలక పదవులు ఇవ్వడానికి జగన్ రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : సొంత నిర్ణయాలు లేవ్.. ముగ్గురు ఐఏఎస్ లపై పవన్ ప్రశంశలు..!

సాధారణంగా వైసీపీ మినహా ఇతర పార్టీల నాయకులు గానీ పదవుల్లో ఉన్న వారు గానీ.. సబ్జెక్ట్ తో అంటే లెక్కలతో మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది కార్యకర్తలకు, సోషల్ మీడియాలో ఉండే అభిమానులకు పోరాడేందుకు అవకాశం ఇస్తుంది. బూతులతో మీడియా సమావేశాలు పెడితే ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంటుంది. ఇది గమనించిన జగన్.. ఈ పరిస్థితి సరి కాదని, సాఫ్ట్ క్యారెక్టర్ లను ముందుకు తెచ్చి, లెక్కలతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయించి, విమర్శలు చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఆ తరహా నాయకులతో జగన్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్