Sunday, September 20, 2026 03:17 AM
Sunday, September 20, 2026 03:17 AM

సొంత నిర్ణయాలు లేవ్.. ముగ్గురు ఐఏఎస్ లపై పవన్ ప్రశంశలు..!

పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో పవన్ మాట – మంతి కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోని తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య,నిరుద్యోగం వంటి సమస్యలపై పవన్ చర్చించారు. పల్లెలు నిజంగా దేశానికి వెన్నెముక లాంటివి.. అందుకే నేను పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నానని తెలిపిన పవన్.. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ లాంటి అధికారుల అనుభవంతోనే ఈ శాఖలో ఈరోజు ఇన్ని రిఫామ్స్ తీసుకురాగలిగామని కొనియాడారు.

Also Read : జగన్ సిఎం అవ్వాల్సిందే.. కొడాలి నాని సంచలన కామెంట్స్

పంచాయతీ రాజ్ శాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అధికారుల అనుభవం, సూచనలతోనే తప్ప నా సొంత నిర్ణయాలు లేవని తెలిపారు. వెంకటకృష్ణ, శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ వంటి అధికారుల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో చాలా మంది ఉద్యోగులు సమస్యలు నా దృష్టికు వచ్చినపుడు ఖచ్చితత్వంగా పనిచేయాలని అధికారులతో అనేక సమీక్షలు చేశామని, అనేక సమీక్షల తర్వాత ఈ శాఖలో చాలా రిఫామ్స్ తీసుకురావాలని అనిపించింది.. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ శాఖలో ఔట్సోర్సింగ్ తో కలిపి దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారన్నారు.

Also Read : ఫైల్స్ క్రియేట్ చేయొద్దు.. చంద్రబాబు సంచలన కామెంట్స్

వీళ్ళందరిలో పదివేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంలో కూడా అధికారులే చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఏ శాఖలో అయినా అభివృద్ధి జరగాలి అంటే మంచి అధికారులు ఉండాలి.. పంచాయతీ రాజ్ శాఖలో అలాంటి అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారన్నారు. అధికారులు ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో కూడా ఉద్యోగులు పని చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము ఇవన్నీ చేయగలుగుతున్నామన్నారు పవన్. గత ప్రభుత్వంలో ప్రతి పోస్టుకు, బదిలీకి ఓ రేటు పెట్టారు.. పోస్టులు, బదిలీలకు రేట్లు పెట్టే పద్ధతిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పానని స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్