Wednesday, May 6, 2026 09:17 PM
Wednesday, May 6, 2026 09:17 PM

జగన్ సిఎం అవ్వాల్సిందే.. కొడాలి నాని సంచలన కామెంట్స్

“కొడాలి నాని” ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినపడే పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సైతం ఈ పేరు ఒక సంచలనం. టీడీపీలో ఉన్న రోజుల కంటే వైసీపీలో ఉన్నప్పుడే ఎక్కువగా ఫేమస్ అయ్యారు నానీ. ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటే.. ఏ వ్యాఖ్యలు చేస్తారా అని టీడీపీ నేతలు ఎదురు చూసే పరిస్థితి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు వీర భక్తుడిగా పేరు తెచ్చుకున్న కొడాలి నానీ.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా కూడా పని చేసారు.

Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?

అయితే 2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత.. సైలెంట్ అయిపోయారు నానీ. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పెద్దగా మాట్లాడటం లేదు నానీ. కానీ తాజాగా గుడివాడలో వైసీపీ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న నానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసారు. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, అందుకే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని నానీ కామెంట్ చేసారు. మరో ఆరు నెలల తర్వాత మళ్ళీ తాను ప్రజల్లోకి వచ్చి, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని పేర్కొన్నారు.

Also Read : టీడీపీతో అర్నబ్ మైండ్ గేమ్..? ఉచ్చులో పడ్డారా..?

రాష్ట్రంలో జరుగుతోన్న అవకతవకలు సహా అనేక అంశాలపై తాను మాట్లాడతానని, పోరాటం చేస్తానని ప్రకటించారు నానీ. అక్రమాలు, వేధింపులు అన్నీ ఎదుర్కొని నిలబడి, వైసీపీ జెండాను ఎగరవేసి, వైఎస్ జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏ విధమైన రాజీ లేదని స్పష్టం చేసారు. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత.. సర్జరీ పేరుతో నానీ ముంబై వెళ్ళిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్