Wednesday, August 5, 2026 11:00 AM
Wednesday, August 5, 2026 11:00 AM

ట్రంప్ టార్గెట్ స్టూడెంట్స్..? భయపెడుతోన్న తాజా లెక్కలు..!

ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కార్.. అనుసరిస్తోన్న విధానాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవర పెడుతున్నాయి. అమెరికాలో అడుగు పెట్టాలంటేనే భయపెట్టే విధంగా ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోంది. తాజాగా వచ్చిన ఓ వార్త చూస్తే.. అమెరికా సర్కార్.. వలసల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి 85,000 వీసాలు రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read : పేడ పురుగులతో జాగ్రత్త.. ఏపీ సర్కార్ వార్నింగ్

మేక్ అమెరికా సేఫ్ ఎగైన్ అనే నినాదంతో ముందుకు వెళ్తోన్న ట్రంప్ సర్కార్.. సరిహద్దు భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. రద్దు చేసిన వీసాలలో 8 వేలకు పైగా వీసాలు విద్యార్ధులవే అంటూ తెలిపింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న విద్యార్ధుల విషయంలో తాము కఠినంగా ఉన్నామని, చదువుల కోసం కాకుండా డబ్బు సంపాదన కోసం అమెరికా వచ్చే వారి విషయంలో భవిష్యత్తులో ఇదే వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేసింది.

Also Read : బ్రేకింగ్: సెలెక్షన్ కమిటీపై బీసీసీఐ సీరియస్.. అత్యవసర మీటింగ్..?

మద్యం సేవించి వాహనం నడపడం, దొంగతనాలు, దాడులు సహా పలు నేరాలతో పలువురి వీసాలను కూడా రద్దు చేసామని, అమెరికన్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉండే వారి విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శిస్తామని హెచ్చరించింది. అటు హెచ్ 1 బీ వీసాల విషయంలో కూడా తమ వైఖరి ఇలాగే ఉంటుందని, స్వదేశీ ప్రతిభను గుర్తించకుండా విదేశాలకు ప్రాధాన్యత ఇచ్చే అమెరికాలోని పరిశ్రమల యజమానులు.. అమెరికన్లకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్