Wednesday, May 6, 2026 10:26 PM
Wednesday, May 6, 2026 10:26 PM

బ్రేకింగ్: సెలెక్షన్ కమిటీపై బీసీసీఐ సీరియస్.. అత్యవసర మీటింగ్..?

భారత క్రికెట్ లో ఇప్పుడు సెలక్షన్ కమిటీ తీరు వివాదాస్పదమవుతుంది. సెలక్షన్ కమిటీ రాజకీయాలు చేస్తోందని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట వినని వాళ్ళను పక్కన పెడుతోందని, సీనియర్ ఆటగాళ్లు విషయంలో డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితిలు బాగా లేవనే వార్తల నేపథ్యంలో.. బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏడాదికాలంగా భారత క్రికెట్ ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో చక్కదిద్దేందుకు బోర్డు పెద్దలు రంగంలోకి దిగారు. ఇటీవల కాలంలో పదే పదే అంతర్జాతీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటుంది భారత క్రికెట్ టీం.

Also Read : అమరావతి: ‘కలల రాజధాని’ నుంచి ‘క్రియేటివ్ క్యాపిటల్’ వైపు

ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లపై వివక్ష చూపిస్తున్నారు.. అనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బోర్డు కీలక సమావేశానికి సిద్ధమైంది. టీమిండియా మేనేజ్మెంట్ తో రేపు ముంబైలో భేటీ కానుంది బీసీసీఐ. కటక్ టి20 ముగిసిన తర్వాత మేనేజ్మెంట్ ముంబై రావాలని ఆదేశించింది. ఈ సమావేశంలో కీలక అంశాలను బోర్డు పెద్దలు ప్రస్తావించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మహమ్మద్ షమీనీ తప్పించే అంశంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. అతను దేశవాళీ క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్నప్పుడు ఎందుకు పక్కన పెట్టారనేది బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఆవేదన. దీనిపై సౌరబ్ గంగూలీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Also Read : తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!

సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ తో పాటుగా వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో, అభిమన్యు ఈశ్వరన్ ను పక్కన పెట్టడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు లేఖ రాసినట్లు సమాచారం. అదేవిధంగా సీనియర్ ఆటగాళ్లపై ఓ యువ ఆటగాడి తండ్రి సోషల్ మీడియా వేదికగా.. నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నాడని బోర్డుకు ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా గంభీర్ పై సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల నెట్ సెషన్ సందర్భంగా ఓ సీనియర్ ఆటగాడితో కోచింగ్ స్టాఫ్ కు గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బోర్డు పెద్దలు.. అత్యవసర సమావేశానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్