Saturday, May 2, 2026 01:30 PM
Saturday, May 2, 2026 01:30 PM

బీ కేర్ ఫుల్.. చంద్రబాబు మాస్ వార్నింగ్..!

నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల తీరు వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 252 మందితో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటైంది.

Also Read : దావూద్ దొరుకుతాడా..? అసలు ఎవరీ సలీం డోలా..?

ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “కార్యకర్తే అధినేత” అనేది నినాదంగా కాదు.. విధానంగా మార్చుకున్నామన్నారు. ఎన్ని సవాళ్లు వచ్చినా కార్యకర్త మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవరికీ భయపడడు, తల వంచడు అని స్పష్టం చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్‌కు కూడా కీలక సూచనలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు.. అత్యున్నత బాధ్యత.. అని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారని.. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే అని చంద్రబాబు వెల్లడించారు.

Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్‌లు..!

ఇదే సమయంలో పార్టీలో కొందరు నేతల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విధానం మార్చుకోకపోతే మనుగడ కష్టమని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారన్న చంద్రబాబు.. ఎవరెవరు ఎవరెవరిని కలుస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. కొందరు ఫ్లెక్సీల దగ్గర గొడవపడుతున్నారు.. కానీ ఇది సరి కాదని పరోక్షంగా ఇటీవల జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నేతలకు, మాజీ ఎమ్మెల్యే వర్మకు మధ్య వివాదాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించారు. కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తనను బాధపెట్టాయని.. ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి.. మన ఉనికి కాపాడుకోవాలని సూచించారు. ఐకమత్యం కాపాడాలని.. కేంద్రానికి, రాష్ట్రానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తున్నామన్నారు.

Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీకి ఇప్పుడు సీసీడీ అనే వ్యాధి సోకిందని.. క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే.. దేశానికి స్వాతంత్ర్యం కూడా తామే తెచ్చామని ఆ పార్టీ చెబుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన చంద్రబాబు.. సొంత పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో చేస్తున్న ప్రతి పని తనకు తెలుస్తుందన్నారు. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా ఎవరు ప్రవర్తించినా సరే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రష్మీని టార్గెట్ చేసిన...

యాంకర్ రష్మీ గౌతమ్‌ను వైసీపీ నేతలు...

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన...

టీడీపీ ఎమ్మెల్యే సంచలన...

ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో...

బ్రేకింగ్ : కల్తీ...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో...

బ్రేకింగ్: డిప్యూటి సీఎం...

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు హైదరాబాద్‌లో...

టీటీడీకి పవన్ లేఖ.....

కూటమి ప్రభుత్వం ఏం చేసినా తప్పే.....

పోల్స్