Wednesday, August 5, 2026 12:58 PM
Wednesday, August 5, 2026 12:58 PM

ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్‌లు..!

అమరావతి సచివాలయంలో వైసీపీ “ధురంధర్”లున్నారా..? ఇందుగలరు.. అందులేరన్న సందేహం వలదు.. ఎందెందు వెతికినా, అందందే కలరు అని హిరణ్యాక్షుడితో ఆయన కొడుకు ప్రహ్లాదుడు చెప్పే మాట.. ఇది వైసీపీ నేతలు, అభిమానులకు సిగ్గా సరిపోతుంది. వైసీపీ అభిమాన ఐఏఎస్‌లు.. మంత్రులు, మంత్రుల ఆంతరంగిక “ధురంధర్”లు. పేరుకే కూటమి ప్రభుత్వం అని.. పెత్తనం అంతా వైసీపీ నేతలదే అంటున్నారు వాస్తవాలు తెలిసిన టీడీపీ అభిమాన ఐఏఎస్‌లు, అధికారులు, ఉద్యోగులు. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు మంత్రి లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే బాగా వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా ఈ విషయం లో మంత్రి లోకేష్‌ నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు సన్నిహితులు.

Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!

కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల నేతలు కూడా లోకేష్ నిర్ణయానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సరే.. లోకేష్‌తో మాత్రమే అవుతుందని బలంగా నమ్ముతున్నారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా తమ ప్రాంతాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం లోకేష్‌ దగ్గరక క్యూ కడుతున్నారు. అటు లోకేష్ కూడా నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలే లోకేష్ బలహీనత అనే మాట ఇప్పుడు పార్టీలో బాగా వినిపిస్తోంది. కార్యకర్తకు చిన్న సమస్య వచ్చిన సరే.. లోకేష్ స్వయంగా స్పందిస్తున్నారు. ఇదే అలుసుగా తీసుకున్న కొందరు నేతలు.. అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఇప్పటివరకు ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో, బదిలీల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ, ఏయే పోస్టుల్లో, ఏయే హోదాల్లో నియమించారనే విషయం పరిశీలిస్తే.. వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులకే కీలక, ప్రాధాన్యత పోస్టులు దక్కాయనే విమర్శలు వచ్చాయి. ఆ విధంగా మీడియాలో కూడా ప్రచారం జరిగింది. లోకేష్ సెలెక్షన్‌లు ఈ విధంగా ఉంటాయేమో.. అనే అపవాదు మూట గట్టుకున్నారు కూడా. ఇక అసలు విషయం ఏమిటంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ నెల 11వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ ప్రభుత్వంలో వైసీపీ అభిమాన మంత్రులు, వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read : తగ్గిన డీజిల్‌ కొరత ప్రభావం.. లిమిట్‌ పెంపు..!

సాక్షాత్తూ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులే వైసీపీ అభిమాన ధురంధర్‌లుగా పనిచేస్తున్నారని, కొందరు మంత్రులు కూడా వైసీపీ ధురంధర్‌లుగానే పనిచేస్తున్నారని కూడా సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. సీఎంఓ ఐఏఎస్ అధికారుల పేషీల్లో కూడా వైసీపీ ధురంధర్‌లు ఉన్నారట. అయితే ఈ విషయం సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలియకుండా ఉంటుందా.. అని సచివాలయ వర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారికి చంద్రబాబు ఎందుకు భరిస్తున్నారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సచివాలయంలో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వైసీపీ అభిమాన ధురంధర్‌లు ఉన్నారట.

అపార అధికారం అనుభవం ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు, మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న శాఖల్లో కూడా కొందరు ఐఏఎస్ అధికారులుే ధురంధర్‌ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారట. ఇటీవల మాజీ సీఎం జగన్ రెడ్డి అభిమాన, రిటైర్డు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రహస్య సమావేశం జరిగిన విషయం అందరినీ భయపెట్టింది. ఆ సమావేశానికి పదిమంది వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు హాజరైనట్లు బయటకు పొక్కినప్పటికీ.. వారిలో ఒకరిని మాత్రమే బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా వైసీపీ ముఖ్యనేతలకు తెలుస్తుందంటే కూటమి సర్కార్‌లో ధురంధర్‌ల ప్రభావం ఎంతగా పనిచేస్తుందో.. వైసీపీ నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో.. ఇట్టే అర్థమవుతుంది.

Also Read : బ్లీచింగ్ ఉచ్చులో పడ్డ టీడీపీ..? వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్..!

ముఖ్యంగా మెజారిటీ మంత్రుల పేషీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల్లో చాలా మంది వైసీపీ అభిమానులే ఉన్నారు. అసలు కొంతమంది మంత్రుల ఆంతరంగిక సిబ్బంది కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీకి అనుకూలంగా పని చేసిన ఓ ఛానల్ రిపోర్టర్.. ఇప్పుడు కీలక మంత్రి దగ్గర పీఎస్‌గా పని చేస్తూ.. అమరావతి పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఆయన ద్వారానే అమరావతి విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు వైసీపీ నేతలకు ముందే తెలుస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఇలా 90 శాతం పైగా వైసీపీ అభిమానులే అనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి రావటం ఖాయం అని ఇప్పటికి వైసీపీ అభిమాన అధికారులు, సిబ్బంది కూడా సచివాలయంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటుంటే.. మళ్లీ జగన్ అధికారంలోకి రాడు అని మంత్రి లోకేష్ ధీమాగా చెబుతుంటే.. మరో మూడేళ్లలో జగన్ రెడ్డి సీఎం అవ్వటం ఖాయమని మంత్రుల పేషీల్లో పనిచేసే వైసీపీ “ధురంధర్‌” లే అనటం విచిత్రంగా ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్