Friday, October 9, 2026 05:03 AM
Friday, October 9, 2026 05:03 AM

ఆర్సీబీ, ఆర్ఆర్ అమ్మకంతో.. బీసీసీఐ ఖజానాలోకి రూ. 1500 కోట్లు..!

ఐపిఎల్ అంటేనే కాసుల వర్షం. ముఖ్యంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ఈ లీగ్ భారీ ఆదాయం తెచ్చి పెడుతోంది. ఇటీవల ఈ లీగ్‌ లో అత్యంత పాపులర్ జట్లు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ రికార్డు స్థాయి ధరలకు చేతులు మారాయి. దీనితో బోర్డుకు భారీ ఆదాయం రానుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టును 1.63 బిలియన్ డాలర్లకు, ఆర్‌సీబీని 1.78 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీంతో ఈ రెండు జట్ల మొత్తం విలువ కలిపి ఏకంగా 3.4 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో.. సుమారు రూ. 31,000 కోట్లకు చేరుకుంది.

Also Read : H-1B వీసా రూల్స్ మార్పు.. విదేశీయులకు కష్టమే..!

ఐపీఎల్ చరిత్రలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఏకైక రెండు జట్లుగా ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ నిలిచి సరికొత్త రికార్డును సృష్టించాయి. ఈ రెండు ఫ్రాంచైజీల భారీ విక్రయం వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఊహించని ఆదాయం రానుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఏదైనా జట్టు యాజమాన్యం మారినప్పుడు లేదా విక్రయించబడినప్పుడు, ఆ విక్రయ ధరలో 5 శాతం మొత్తాన్ని బదిలీ రుసుము రూపంలో బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : బ్రేకింగ్; పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం!

ఈ లెక్కన 3.4 బిలియన్ డాలర్ల విక్రయంపై విధించిన 5 శాతం రుసుము.. కారణంగా బీసీసీఐ ఖాతాలో సుమారు రూ. 1,550 కోట్ల నుంచి రూ. 1,583 కోట్ల వరకు జమ కానుంది. ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఈ రెండు జట్ల అమ్మకం ద్వారానే ఇంతటి భారీ మొత్తాన్ని ఆర్జించడం గమనార్హం. ఒకప్పుడు కేవలం వందల కోట్లలో ఉన్న ఐపీఎల్ జట్ల విలువ, ఇప్పుడు వేల కోట్ల స్థాయికి చేరుకోవడం క్రీడా రంగంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆర్‌సీబీకి ఉన్న విపరీతమైన క్రేజ్, రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ విలువ ఈ జట్లకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్