Friday, October 9, 2026 06:53 AM
Friday, October 9, 2026 06:53 AM

బ్రేకింగ్; పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం!

గత మూడేళ్ళుగా భారీగా పెరిగిన ఇంధన ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వాహనదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది. పెట్రోల్‌ పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని రూ. 13 నుంచి ఏకంగా రూ.3లకు తగ్గించిన కేంద్రం.. డీజిల్‌ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం కనపడుతోంది.

Also Read : సీట్ల పెంపు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

లీటరుకు సుమారు రూ. 10 మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, సామాన్యులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. డీజిల్‌ పై సుంకం పూర్తిగా ఎత్తివేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రైతులు, లారీ యజమానులు, సామాన్య వాహనదారులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం.

Also Read : మెగా ఫ్యామిలీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..!

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుండటంతో, రేపటి నుంచి పెట్రోల్ బంకుల వద్ద కొత్త ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గత 5 ఏళ్ళలో భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అటు అంతర్జాతీయంగా కూడా భారత్ కు కాస్త సానుకూల పవనాలు కనపడుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది జగన్ వ్యూహమా?...

స్థానిక సంస్థల ఎన్నికల్లో YSRCP వ్యవహరిస్తున్నతీరు...

స్థానిక సంస్థల ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల...

టీటీడీ పై విజయసాయిరెడ్డి...

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునర్వ్యవస్థీకరణ,...

గాల్లోనే విమానంపై పడ్డ...

ఆకాశంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో ప్రయాణికులకు...

రాజకీయాల్లోకి యంగ్ హీరో...

తమిళనాట సినీ గ్లామర్‌కు, రాజకీయాలకు ఎప్పుడూ...

ప్లాస్టిక్ కరెన్సీ రెడీ.....

రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఎక్కడా...

పోల్స్