Tuesday, May 19, 2026 05:16 PM
Tuesday, May 19, 2026 05:16 PM

బాలయ్య – కొరటాల కాంబో.. ఇంటర్వెల్ సీన్ వేరే లెవెల్ అంతే..!

నట సింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంపై సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోయే ఆగస్టు నెలలో అఫీషియల్‌ గా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. “అధికారానికి ఉద్దేశం తోడైతే అది ఉద్యమంగా మారుతుంది” అనే పవర్‌ ఫుల్ ట్యాగ్‌ లైన్‌ తో అనౌన్స్ అయిన ఈ సినిమా కథలో బలమైన సామాజిక సందేశంతో పాటు, సెకండాఫ్‌ లో వచ్చే మాఫియా బ్యాక్‌ డ్రాప్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌ కు తీసుకువెళ్తుందని టాక్.

Also Read : నీట్‌ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం..!

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఒక భారీ సెట్‌ ను నిర్మించబోతున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ ఫీల్ వచ్చేలా, అభిమానులు పూనకాలతో ఈలలు వేసేలా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్‌ ను దర్శకుడు కొరటాల శివ అత్యంత అద్భుతంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.

Also Read : ఏపీలో ప్రభుత్వ బడులకు ఫుల్ క్రేజ్..!

ఈ ప్రతిష్టాత్మక ఇంటర్వెల్ షూట్‌ లో నందమూరి బాలకృష్ణతో పాటు సినిమాలో నటించే మిగిలిన మెయిన్ రోల్స్ అంతా ఏకకాలంలో పాల్గొనబోతుండటం ఈ సీన్‌ కే ఓ రేంజ్ హైలైట్‌ గా నిలవనుందని టాక్. కొరటాల శివ తన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్లను చాలా పవర్‌ ఫుల్‌ గా చూపిస్తారు. అందువల్ల ఈ చిత్రంలో కూడా బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్‌ ను, స్క్రీన్ ప్రెజెన్స్‌ ను మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త మేకోవర్‌ లో ప్రెజెంట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేంద్రానికి విజయ్ బిగ్...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ...

ముందస్తు ఎన్నికలకు రెడీ...

తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి....

ముంబై హైకోర్ట్ లాయర్...

దేశంలో మహిళల భద్రతపై ఇటీవలి కాలంలో...

నీట్‌ పరీక్షపై కేంద్రం...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్‌పై...

అవును.. వాళ్లిద్దరు కలిశారు.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగని.....

సమన్యాయం అంటే ఇదేనేమో..!

“ఒక కేసు అనేక ప్రశ్నలు, అనేక...

పోల్స్