Thursday, April 30, 2026 01:22 PM
Thursday, April 30, 2026 01:22 PM

పూడి శ్రీహరి.. ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లో ఏముంది..?

వైఎస్ జగన్ మాజీ పీఆర్వో పూడి శ్రీహరి అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలక సాక్ష్యాలుగా మారాయి. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్న సమయంలోనే ఈ డిజిటల్ పరికరాలను సీజ్ చేసిన పోలీసులు, వీటి ద్వారా అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న లోతైన నెట్వర్క్‌ ను ఛేదించాలని భావిస్తున్నారు. ఈ పరికరాల్లో ఉండే డిజిటల్ ఫుట్‌ ప్రింట్స్ ద్వారా ఆ వివాదాస్పద పోస్టులు, యానిమేషన్ వీడియోలు ఏ ఐపీ అడ్రస్ నుండి అప్లోడ్ అయ్యాయి, వాటిని ఎప్పుడు క్రియేట్ చేశారు అనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

Also Read : వాంఖడేలో రోహిత్ ఆడతాడా..? గాయంపై వీడని సస్పెన్స్..!

ముఖ్యంగా పూడి శ్రీహరి గత ప్రభుత్వ హయాంలో కీలక పదవిలో ఉన్నందున, ఆయన మొబైల్‌ లోని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చాట్‌ లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలనే వ్యూహాలకు సంబంధించిన సమాచారం ఈ చాట్స్‌ లో ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఆయన డేటాను డిలీట్ చేసినా, అత్యాధునిక ఫోరెన్సిక్ టెక్నాలజీ సాయంతో ఆ సమాచారాన్ని తిరిగి రికవర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!

మరోవైపు, ల్యాప్టాప్‌ లో నిక్షిప్తమై ఉన్న డేటా ద్వారా ఆ వీడియోల మేకింగ్ వెనుక ఉన్న ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్ల మూలాలను కూడా వెలికితీయనున్నారు. ఈ పరికరాల్లో దొరికే సమాచారం కేవలం శ్రీహరికే కాకుండా, ఆయనకు సహకరించిన ఇతర ముఖ్య నాయకులకు కూడా చుట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ డిజిటల్ ఆధారాల విశ్లేషణ పూర్తయితే, ఈ కేసులో మరికొన్ని సంచలన అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

బ్రేకింగ్ : టీడీపీ...

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు...

బీ కేర్ ఫుల్.....

నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధుల తీరు...

వాంఖడేలో రోహిత్ ఆడతాడా..?...

ఐపీఎల్ 2026 సీజన్‌ లో వరుస...

గుంటూరు – కనిగిరి...

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం సహకారంతో రైల్వే ప్రాజెక్టుల...

ఏపీ పోలీస్ శాఖలో...

ఏపీ పోలీస్ శాఖలో ప్రక్షాళనపై సర్కార్...

పోల్స్