Wednesday, August 5, 2026 02:51 PM
Wednesday, August 5, 2026 02:51 PM

వాంఖడేలో రోహిత్ ఆడతాడా..? గాయంపై వీడని సస్పెన్స్..!

ఐపీఎల్ 2026 సీజన్‌ లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌ కు మరో గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. బుధవారం వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌ తో జరగనున్న కీలక పోరుకు ముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్ లకు దూరం కావడమే కాకుండా, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన రోహిత్ శర్మ, ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా దూరమయ్యాడు రోహిత్.

Also Read : ఏపీ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన..!

బుధవారం నాటి మ్యాచ్‌ లో అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జట్టు మేనేజ్మెంట్ రోహిత్ ఫిట్నెస్‌ పై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో సస్పెన్స్ మరింత పెరిగింది. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే హైదరాబాద్‌పై గెలవడం జట్టుకు అత్యంత కీలకం. ఇటువంటి సమయంలో రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు దూరం కావడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read : బ్లీచింగ్ ఉచ్చులో పడ్డ టీడీపీ..? వైసీపీ మైండ్ గేమ్ సక్సెస్..!

ఒకవేళ రోహిత్ గనుక తుది జట్టులో లేకపోతే, అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వాంఖడే పిచ్‌పై రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. అయితే, గాయం తీవ్రతను బట్టి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు మెడికల్ టీమ్ రోహిత్ ఫిట్నెస్‌ ను పరీక్షించి తుది నిర్ణయం తీసుకోనుంది. హిట్ మ్యాన్ తన హోమ్ గ్రౌండ్‌ లో సిక్సర్ల వర్షం కురిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా, ఫిట్నెస్ అప్‌డేట్ మాత్రం ముంబై క్యాంప్‌ లో టెన్షన్ పుట్టిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్