Saturday, September 19, 2026 07:25 AM
Saturday, September 19, 2026 07:25 AM

బ్రేకింగ్: మిథున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో క్రమంగా దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఈ వ్యవహారంలో పార్లమెంట్ వేదికగా సంచలనం కావడంతో విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మద్యం పాలసీ కేసు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని హైకోర్టుకు వ్యాఖ్యానించిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్ట్ బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఐడీ బృందాలు ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఢిల్లీకి చేరుకున్నాయి.

Also Read : కొంప ముంచిన వాయిస్ మెసేజ్..!

మిథున్ రెడ్డి పాత్రపై ఆరోపణలతో పాటుగా పలు ఆధారాలు కూడా ఉన్న నేపధ్యంలో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ వెంటనే సిఐడీ అధికారులు ఢిల్లీ వెళ్ళడంతో ఆసక్తిని రేకిత్తోస్తోంది. ఇటీవల, హైదరాబాద్‌లోని పలు ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ల సమయంలో, సీఐడీ అధికారులు పలువురు మహిళలను సైతం విచారించారు. ఇక ఈ కేసులో మిథున్ రెడ్డి.. తనకు బెయిల్ కావాలని సుప్రీం కోర్ట్ గడప తొక్కారు. సుప్రీం ఏం చేస్తుంది అనే దానిపై ఆసక్తి పెరిగింది.

Also Read : టీడీపీ లీగల్ సెల్ నిజంగానే బలహీనమా..?

ఇక మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి పలు సాక్ష్యాలను ఇప్పటికే సిఐడీ అధికారులు సేకరించారు. అటు ఈడీ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణల నేపధ్యంలో విచారణకు సిద్దమవుతున్నారు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఈడీ ఫోకస్ పెట్టె అవకాశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు అమలులో ఉన్నా సరే.. ఏపీలో వైన్ షాపుల్లో నగదు తీసుకోవడంపైనే అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్