Saturday, May 9, 2026 08:19 AM
Saturday, May 9, 2026 08:19 AM

టీడీపీ లీగల్ సెల్ నిజంగానే బలహీనమా..?

కేసుల విషయంలో నిజంగానే టీడీపీ వెనకబడిందా.. తప్పు చేసిన వాళ్లను అరెస్టు చేస్తే.. వాళ్లు త్వరగా బయటకు ఎలా వస్తున్నారు.. ఆధారాలు కరెక్టుగానే ఉన్నా.. అన్ని రుజువులు ఉన్నా కూడా.. తప్పు చేసిన వారంతా బయటే ఎలా తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం.. చాలా లోతుగా పరిశీలించాల్సిందే. అసలు తప్పు ఎక్కడ ఉందో తెలియాలంటే.. వాస్తవాలు తెలుసుకోవాలి. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగినన్ని అక్రమాలు మరెప్పుడు జరగలేదు అనేది వాస్తవం. ఏపీ ప్రజలంతా ముద్దుగా సైకో రాజ్యం అని పేరు పెట్టుకున్నారంటే… ఎన్ని అరాచకాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. చివరికి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలన్నా సరే.. భయపడిపోయారు. అయితే.. నాటి పార్టీ నేతలకు అండగా నిలిచింది ఎవరూ అంటే.. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్. పార్టీ నేతలు అరెస్టు కాకుండా అడ్డుపడింది టీడీపీ లీగల్ సెల్. అసలు పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని వాదించి.. బెయిల్ వచ్చేలా చేసింది ఎవరు.. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.

Also Read : సినిమాని చంపెయ్యకండి.. మీడియాపై నిర్మాత ఫైర్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అధినేత అండ చూసుకుని రెచ్చిపోయారు. కొందరు నోరు పారేసుకుంటే.. మరి కొందరు అధికార దర్పం ప్రదర్శించారు. కొంతమంది దాడులకు తెగబడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలనేది టీడీపీ, జనసేన కార్యకర్తలు తొలి నుంచి చేస్తున్న డిమాండ్. భారీ మెజారిటీతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిపై చర్యలు ఉంటాయని అంతా భావించారు. కానీ అలా జరగటం లేదనేది ప్రధాన ఆరోపణ. నేతలను అరెస్టు చేసినా సరే.. వారికి వెంటనే బెయిల్ వస్తుంది. ఇక అరెస్టు ఖాయమని ముందుగానే పసిగట్టిన కొంతమంది వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ తెచ్చుకోగలగుతున్నారు. అయితే వారిపై దాఖలైన కేసుల్లో సాక్ష్యాలను చూపించడంలో లోపమో, నిర్లక్ష్యమో తెలియదు కానీ… అలాంటి వారికి బెయిల్ ఇట్టే వచ్చేస్తోంది. అయితే ఇదంతా ఎలా సాధ్యం.. ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ఎవరూ.. అంటే.. క్యాడర్ అంతే మంగళగిరి పార్టీ కార్యాలయం వైపు వేళ్లు చూపిస్తున్నాయి. కానీ వాస్తవాలు మాత్రం వేరు.

Also Read : మలేషియాలో క్యాంప్.. వైసీపీ బిగ్ ఆఫర్..!

వాస్తవానికి టీడీపీలో లీగల్ సెల్ అనేది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విభాగం. దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలకు సంబంధించిన అన్ని కేసులు ఆయనే పరిధిలోనే ఉంటాయి. పార్టీ నేతలకు ఎలాంటి న్యాయసహాయం కావాలన్నా సరే.. పోసాని వెంకటేశ్వర్లును సంప్రదిస్తారు. పోసాని సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందే. అంతెందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సమయంలోనాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన టీడీపీ లీగల్ సెల్‌కు నాయకత్వం వహించింది కూడా పోసాని వెంకటేశ్వర్లు టీమ్. లోకేష్‌కు ముందస్తు బెయిల్ తీసుకోవడంలో కూడా పోసాని టీమ్ కీలక పాత్ర పోషించింది. మరి నాడు అంత సమర్థవంతంగా పని చేసిన లీగల్ సెల్.. ఇప్పుడు ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందనేది సగటు కార్యకర్త అనుమానం.

Also Read : మిథున్ రెడ్డి ఏం చేయబోతున్నట్టు..?

ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టీడీపీ లీగల్ సెల్ వేరు.. ప్రభుత్వ న్యాయ విభాగం వేరు. టీడీపీ లీగల్ సెల్‌కు పోసాని వెంకటేశ్వర్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తుంటే.. ప్రభుత్వ న్యాయ విభాగం అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులను అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ న్యాయ విభాగం వాదిస్తోంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకపోవడంతో తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ లీగల్ సెల్‌పై విమర్శలు చేస్తున్నారు.

Also Read : బ్రేకింగ్: మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

మరో విషయం ఏమిటంటే.. న్యాయ వ్యవస్థలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ అనేది ఒకటి ఉందని టీడీపీ నేతలకు పరిచయం చేసింది కూడా టీడీపీ లీగల్ సెల్. ఎలాంటి నోటీసులు లేకుండా అక్రమంగా అరెస్టు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. చివరికి చిన్న చిన్న సెక్షన్లు నమోదు చేసి.. ఎలాంటి విచారణ చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేశారు పోసాని వెంకటేశ్వర్లు. ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలని.. తర్వాత విచారించి.. రుజువైతేనే అరెస్టు చేయాలని కూడా హైకోర్టులో వాదించారు. అలాగే 41ఏ సెక్షన్ పైన పార్టీ నేతలు, కార్యకర్తలకు అవగాహన కల్పించారు కూడా. ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో… జగన్ చేయని అరాచకాలు లేవు. న్యాయవ్యవస్థలో రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కూడా గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వాటిని టీడీపీ లీగల్ సెల్ ధీటుగా అడ్డుకుంది. జగన్ సర్కార్ కొత్త కొత్త మార్గాల్లో అరెస్టులకు ప్రయత్నిస్తే… టీడీపీ లీగల్ సెల్.. సరికొత్త ప్రయోగాలతో వాటిని సమర్థంగా అడ్డుకుంది.

Also Read : మోడీ షాకింగ్ నిర్ణయం.. వారసుడు ఎవరు..?

గత ప్రభుత్వ హయాంలో అటు శ్రీకాకుళం మొదలు.. ఇటు చిత్తూరు జిల్లా వరకు ప్రతి ఒక్క నేతపై కూడా అక్రమ కేసులు పెట్టారు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, పట్టాభి, ఆదిరెడ్డి అప్పారావు, కూన రవికుమార్, గౌతు శిరీష, వంగలపూడి అనిత, బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా మంది నేతలున్నారు. ఇక కార్యకర్తల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వీరంతా బెయిల్ పై బయటకు వచ్చారంటే.. అందుకు టీడీపీ లీగల్ సెల్ కారణం. వీరికి ఇప్పటికీ లీగల్ సెల్ సాయం చేస్తూనే ఉంది. న్యాయపరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు. నాడు పోసాని అనుసరించిన న్యాయపరమైన అంశాలనే నేటి వైసీపీ న్యాయవాది నిరంజన్ రెడ్డి అనుకరిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో.. నాడు లోకేష్ ముందస్తు బెయిల్ కోసం పోసాని వెంకటేశ్వర్లు మాదిరిగానే వ్యవహరించారు. హైకోర్టుకు కూడా లోకేష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విధానాన్నే ఉదాహరించారు ఎంపీ నిరంజన్ రెడ్డి.

Also Read : ఆ భక్తులకు టిటిడి ప్రత్యేక సౌకర్యాలు

ప్రస్తుతం ప్రభుత్వం తరఫున కేసులు వాదిస్తోంది అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని విభాగం. ప్రభుత్వం తరఫున వాదనలు గట్టిగా వినిపించలేకపోతున్నారనే చర్చ టీడీపీ శ్రేణుల్లో జోరుగా జరుగుతోంది. అందుకే కొంతమందికి బెయిల్ వెంటనే వస్తుండగా.. మరికొంతమంది… ముందస్తు బెయిల్‌ను చాలా సింపుల్‌గా తీసుకుంటున్నారు. చివరికి మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి 9 నెలలు పట్టిందా… అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పోసాని కృష్ణమురళీకి వెంటనే బెయిల్ రావడంతో.. ఖంగుతిన్న ప్రభుత్వ లీగల్ సెల్.. వంశీ కేసులో బెయిల్ రాకుండా వాదించే బాధ్యతను సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లుకు అప్పగించింది.

పోసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని టీడీపీ లీగల్ సెల్ చాలా బలంగా ఉంటే… దమ్మాలపాటి శ్రీనివాస్ సారధ్యంలోని ప్రభుత్వ న్యాయ విభాగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. టీడీపీకి చెందిన లీగల్ టీమ్.. పార్టీకి నిస్వార్థంగా సేవలందిస్తుంటే.. కూటమి ప్రభుత్వ లీగల్ టీమ్ మాత్రం పేలవమైన పనితీరుతో విమర్శల పాలవుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో ఇక 24...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు...

బీజేపీలోకి కొడాలి నాని.....

కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి...

తమిళ పొలిటికల్ థ్రిల్లర్.....

తమిళనాడు రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతూ...

ఆపరేషన్ సుమతి.. టార్గెట్...

“ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి...

లోకేష్ మరో రాయల్...

ఏపీ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా...

బ్రేకింగ్: టీడీపీ సంచలన...

ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

పోల్స్