Friday, September 12, 2025 03:16 PM
Friday, September 12, 2025 03:16 PM
roots

పీకే మార్క్ పాలిట్రిక్స్… వర్కవుట్ అవుతాయా….?

పీకే… ఈ రెండు అక్షరాలకు దేశ రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ ఉంది. పీకే అంటే తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ అని అంతా భావిస్తారు. కానీ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అనేది పొలిటికల్ సర్కిల్‌లో అందరికీ తెలిసిన పేరు. వ్యూహకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రశాంత్ కిషోర్… 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎంతో కృషి చేశాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపుకోసం పీకే టీమ్ శాయశక్తులా కృషి చేసింది. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత పీకేను జగన్ ఆలింగనం చేసుకున్న ఫోటో వైరల్‌గా కూడా మారింది. అయితే ఎన్నికల తర్వాత ఐ ప్యాక్ టీమ్ విడిపోయింది. పీకే మాత్రం రాజకీయ వ్యూహకర్తగా బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుపు కోసం పని చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత పీకే ప్లాన్ మారిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పీకే… ఏకంగా రాజకీయ పార్టీ స్థాపించారు. బీహార్‌లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడే తన మార్క్ రాజకీయానికి పీకే తెరలేపారు.

Also Read : అల్లు అర్జున్ సరిహద్దుల్లో పోరాటం చేశాడా..? రేవంత్ సంచలన కామెంట్స్

పుష్ప గ్రాండ్ సక్సెస్ తర్వాత హీరో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బన్నీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. పుష్ప 2 సినిమాకు నార్త్‌లో బాగా డిమాండ్ వచ్చింది. అందుకే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ముందుగా బిహార్‌లోని పాట్నాలో ఏర్పాటు చేశారు. అక్కడ బన్నీని చూసందుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ఒకదశలో లాఠీఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. ఇలాంటి పుష్ప క్రేజ్‌ను వాడుకునేందుకు పీకే మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బన్నీని ఇటీవల ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలిశాడు పీకే. ఏదో సరదాగా రెండు ముక్కలు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : అమ్మో పవన్ అంటున్న అధికారులు.. తర్వాతి గురి ఎవరిపై..?

వాస్తవానికి అల్లు అర్జున్‌తో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదనేది బన్నీ సన్నిహితుల మాట. కానీ బయటకు మాత్రరం ఓ లీక్ న్యూస్ సంచలనంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలపై పీకేతో బన్నీ చర్చించారని… త్వరలోనే బన్నీ కూడా తెలుగు రాజకీయాల్లోకి వస్తారంటూ న్యూస్ వైరల్‌గా మారింది. అయితే దీనిని అల్లు అర్జున్ కార్యాలయం కొట్టిపారేసింది. అల్లు అర్జున్‌కు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని.. ఇలాంటి వార్తలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మవద్దని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఈ లీక్ వెనుక పీకే ప్లాన్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. బిహార్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు పీకేనే ఇలాంటి న్యూస్ వైరల్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఏపీలో జగన్‌కు, తెలంగాణలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా కూడా ఈ న్యూస్ మారుతుందనే గేమ్ ప్లాన్‌తోనే ఈ తరహా లీక్‌లను పీకేనే ఇస్తున్నాడనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఇలాంటి లీక్ వార్తలు వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్