వైసీపీలో నంబర్ 2 చాలా కీలకం. అందుకే ఈ స్థానం కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న జగన్… పార్టీలో కేవలం ఆ నలుగురు నేతలకు తప్ప.. మిగిలిన వారికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో నెంబర్ టూ స్థానం కోసమే కీలక నేతలంతా పోటీ పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి… ఇలా ఈ జాబితా చాలా పెద్దదే. అయితే వీరందరినీ కాదని నంబర్ టూ పొజిషన్‌లో నిలిచిన విజయసాయిరెడ్డికి ఆ సంఖ్య ఏ మాత్రం కలిసి వచ్చినట్లు లేదు.
Also Read: ఇంకా లేట్ వద్దు… పిలిచేద్దాం అంటున్న టీడీపీ అధిష్టానం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే ఏ2 విజయసాయిరెడ్డి. ఆ కేసు ఎఫ్ఐఆర్ వరకు విజయసాయిరెడ్డి పేరు చాలా మందికి తెలియదనే చెప్పాలి. కేవలం ఓ ఆడిటర్‌గా మాత్రమే అందరికీ పరిచయం. అయితే ఏ2గా ఎఫ్ఐఆర్‌లో పేరు రావడంతో అంతా షాక్ అయ్యారు. చాలా మంది వైసీపీ నేతలు కూడా అప్పుడే విజయసాయిరెడ్డి పేరు విన్నారు. జగన్‌తో పాటు 16 నెలలు జైలు జీవితం గడిపిన సాయిరెడ్డి… బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి పొలిటిషన్‌గా మారిపోయారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో పార్టీ ఆర్థిక కార్యకలాపాల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ తానే అయి నడిపించారు.

ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి ఢిల్లీలో పార్టీ తరఫున చక్రం తిప్పారు. దీంతో ఆయనే నెంబర్ టూ అనేశారు అంతా. అయితే విజయసాయిరెడ్డికి నెంబర్ టూ స్థానం ఏ మాత్రం కలిసివచ్చినట్లుగా లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో నెంబర్ టూగా 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపైన ఫోకస్ పెట్టారు. జగన్ తర్వాత నేనే అని బహిరంగగానే వ్యాఖ్యానించారు. అయితే అక్కడ చేసిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు అన్నీ కూడా రివర్స్ అయ్యాయి. దీంతో చివరికి ఎంపీ టికెట్ రాకపోవడంతో నెంబర్ 2గా మిగిలిపోయారు. తాజాగా కాకినాడ పోర్టులో జరిగిన అక్రమాల్లో కూడా విజయసాయిరెడ్డి ఏ2. పోర్టు వ్యాపారంలో బెదిరించారంటూ వచ్చిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి పేరు ఏ2గా చేర్చారు పోలీసులు.
Also Read: ఏపీ డీజీపీ ఎవరు..? ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్..?
ఇక వీటన్నిటికి తోడు… కుటుంబ వ్యవహారంలో కూడా సాయిరెడ్డికి నెంబర్ 2 కలిసి రాలేదు. దేవాదాయ శాఖ అధికారితో సంబంధం పెట్టుకున్నారని ఆమె భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా విజయసాయిరెడ్డికి సదరు అధికారిణి నెంబర్ టూ భార్య అయితే… ఆ అధికారిణికి కూడా విజయసాయిరెడ్డి నెంబర్ టూ భర్త. జగన్ సర్కార్‌లో నేనే నెంబర్ టూ అంటూ చక్రం తిప్పిన విజయసాయిరెడ్డికి ఆ నెంబర్ ఏ మాత్రం కలిసి రాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు కుటుంబ పరంగా, ఇటు రాజకీయాల్లో, అటు వ్యాపారాల్లో కూడా విజయసాయిరెడ్డి ఏ2గా మిగిలిపోయారని… ఈ నెంబర్ టూ అనేది విజయసాయిరెడ్డికి పెద్ద తలనొప్పిగా మారి.. కంటిమీద కునుకు లేకుండా చేసిందనేది ఆయన సన్నిహితుల మాట.

