Wednesday, May 6, 2026 11:18 PM
Wednesday, May 6, 2026 11:18 PM

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్లుగా ఆగిపోయిన క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ఆయా మతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కానుకలు అందించింది. బియ్యం, పప్పు, ఉప్పు, బెల్లం, చింతపండు, పేనీలు… ఇలా ఒక కుటుంబం సంతోషంగా పండుగ జరుపుకునేలా చంద్రబాబు ప్రభుత్వం నిత్యావసర వస్తువులను అందించింది. ప్రతి పండుగకు సరిగ్గా వారం రోజుల ముందే ఈ కానుకల సరుకులను రేషన్ షాపుల ద్వారా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. దీనికి అప్పట్లో చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకల పేరుతో వివిధ మతాలకు అనుగుణంగా పండుగ వస్తువులను కానుకగా అందించారు.

Also Read : మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్

ఏపీలో 2019 వరకు రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలను ప్రభుత్వమే అందించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం… వీటిని పూర్తిగా రద్దు చేసింది. మొదట్లో చంద్రబాబు కానుక పేరు మార్చి ఇస్తారని నిరుపేదలు ఆశ పడ్డారు. అయితే జగన్ సర్కార్ మాత్రం… పేరు మార్చేసింది… అలాగే పథకం కూడా రద్దు చేసింది. దీంతో ఐదేళ్ల పాటు నిరుపేదలు పండుగల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కున్నారనేది వాస్తవం. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సమయంలో ప్రధానంగా ప్రచారం చేశారు. నిరుపేదలకు ఇచ్చే కానుక కూడా ఎలా రద్దు చేస్తావు జగన్ అంటూ బహిరంగంగానే ప్రశ్నించారు. అలాగే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పండుగ కానుకలను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read : టీటీడీ మరో కీలక నిర్ణయం…!

2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వం… ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేలా అడుగులు వెస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తర్వాత ముందుగా క్రిస్మస్ పండుగ వస్తోంది. ఆ తర్వాతే సంక్రాంతి, రంజాన్ పండుగలున్నాయి. కాబట్టి ముందుగా క్రిస్మస్ కానుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సంక్షేమ పథకాలకు అర్హులైన వారికి క్రిస్మస్ కానుక అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అలాగే త్వరలోనే అంబేద్కర్ విద్యాదీవెన పథకాన్ని కూడా పునరుద్థరిస్తామన్నారు. వైసీపీ సర్కార్‌లో ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించారని… కానీ డిసెంబర్, జనవరి నెలల్లోనే ఎస్సీ కార్పోరేషన్ ద్వారా అర్హులకు రుణాలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి ప్రకటనతో పండుగ సమయానికి కానుక వస్తుందని.. సంతోషంగా పండుగ జరుకుంటామని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్