Wednesday, February 4, 2026 11:24 PM
Wednesday, February 4, 2026 11:24 PM

ఈ ఒక్క స్కామ్ చాలు.. వైసీపీ నాయకులందరినీ లోపలేయడానికి

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసిన చండాలం అంతా ఇంతా కాదు. రాజకీయంగా బలంగా ఉన్నామనే కారణంతో చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా కేవలం కొందరికి న్యాయం చేసే విధంగా లేదా జగన్ కు ఆర్ధికంగా మేలు చేకూర్చే విధంగానే ఉండేవి. ఇక అవినీతి వ్యవహారాలు అయితే పెద్ద ఎత్తున గత అయిదేళ్ళలో చోటు చేసుకున్న మాట వాస్తవం. దీనిపై చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. వైసీపీలో ఉన్న కొందరు కీలక నేతల అవినీతి వ్యవహారాల మీద చంద్రబాబు సర్కార్ చర్యలకు సిద్దమవుతుంది.

టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మరింత లోతుగా ప్రభుత్వ విచారణ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ అంశాన్ని తాజాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మంత్రి నారాయణ, కీలక అంశాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి తోపాటు.. విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పలు ఆరోపణలు వచ్చాయి. తణుకు మున్సిపాలిటీలో రూ.754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు పురపాలక శాఖ, అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి.

Also Read : దువ్వాడ కుటుంబ వ్యవహారంలో మరో కీలక ట్విస్ట్

మొత్తం 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడి అయింది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీకి ఎకరా 10 కోట్లు విలువ చూపినట్టు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గుర్ని సస్పెండ్ చేసింది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్ల పై అంతర్గత విచారణను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కుంభకోణంలో విచారణ సక్రమంగా జరిగితే వైసీపీ కి చెందిన కీలక నేతలంతా జైలుకి వెళ్లడం ఖాయమని వైసీపీలో నాయకులే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్