Saturday, September 13, 2025 03:19 AM
Saturday, September 13, 2025 03:19 AM
roots

బాబు సంచలన నిర్ణయం.. వణికిపోతున్న పెద్దిరెడ్డి వర్గం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది. ఏకంగా మదనపల్లి ఆర్డీవో ఆఫీస్ కి నిప్పు పెట్టిన తర్వాత.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వైసీపీ నేతల్లో కనపడుతుంది. పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం కూడా సైలెంట్ గానే ఉందనే కామెంట్స్ వినపడుతున్నాయి. జిల్లా వైసీపీ నేతలు కూడా పెద్దగా ఆయనకు మద్దతుగా మాట్లాడిన పరిస్థితి కనపడటం లేదు. కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి అండగా నిలిచే సాహసం చేయడం లేదు. పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవి కూడా పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం కోర్టు పరిధిలో ఉండటంతో ఎవరూ ధైర్యంగా మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు టీడీపీ కీలక అడుగు వేసింది. చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి అక్రమాలను బయటకు తీసేందుకు పార్టీ నేతలు పూనుకున్నారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించడం, అలాగే పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో ప్రజా దర్బార్ వంటివి చేయనున్నారు. ఈ బాధ్యతను మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీసుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ప్రజల నుంచి వినతులు తీసుకుంటారు.

Also Read : దూకుడు పెంచిన లోకేష్.. కొత్త చరిత్రకి శ్రీకారం

దీనితో ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఆయనకు మద్దతుగా నిలిచే నేతలు అందరిలో భయం మొదలయింది. కొందరు నేతలు కూడా ఆయనకు బినామీలుగా ఉన్నారని గుర్తించారు. ఇప్పుడు వారు అందరూ కూడా వైసీపీకి రాజీనామా చేసి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు. కొందరు అయితే టిడిపి లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులు కాల్చేసిన తర్వాత వైసీపీ నేతలు అందరి మీద దృష్టి పెట్టారు. ముందు పుంగునూరులో ఉన్న వైసీపీ నేతలు అందరూ పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పెద్దిరెడ్డికి సహకరించిన ప్రతి నాయకుడి పై విచారణ చేసే అవకాశాలు కనపడటంతో చిత్తూరు జిల్లాలో ఆయన వర్గం వణికిపోతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్