Saturday, June 20, 2026 11:56 PM
Saturday, June 20, 2026 11:56 PM

ప్రధాని మోడీ తో పవన్ కళ్యాణ్ కుటుంబం

ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా నేడు(గురువారం) కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్‌‌ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. మోదీ నివాసంలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే సారథిగా భాగస్వామ్య పక్షాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 8వ తేదీ లేదా 9న మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తన తనయుడు అకీరా నందన్‌‌‌ను త్వరలోనే సినీరంగంలో అరంగ్రేటం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది…

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్