Friday, November 13, 2026 01:27 PM
Friday, November 13, 2026 01:27 PM

డీజిల్ ధర రూ.7 మాత్రమే పెంచాం.. ప్రధాని సంచలన కామెంట్స్..!

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని దేశ వ్యవసాయ రంగ పురోగతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని, దీని ప్రభావం భారత్‌పైనా ఉందని ఆయన తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లీటర్ డీజిల్ ధరను రూ. 50 పెంచాల్సి ఉన్నప్పటికీ, రైతులు, సామాన్య ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కేవలం రూ. 7 మాత్రమే పెంచిందని స్పష్టం చేశారు.

Also Read : పారిశ్రామిక రంగంలో గేమ్ ఛేంజర్.. చంద్రబాబు బిగ్ స్టెప్..!

మిగిలిన రూ. 43 భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ రైతులకు అండగా నిలుస్తోందని వివరించారు. దేశంలోని ప్రతి రంగానికి సౌరవిద్యుత్‌ను అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. పీఎం-కుసుమ్ పథకం ద్వారా ఇప్పటివరకు రైతులకు దాదాపు 12 లక్షల సోలార్ పంపులను అందించామని, దీనివల్ల రైతుల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని తెలిపారు. ఈ సౌర విప్లవం దేశంలోని అన్నదాతలను ఊర్జాదాతలుగా మార్చిందని ఆయన అభివర్ణించారు.

Also Read : పీరియడ్స్ ముందు మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడనివి ఇవే..!

ప్రభుత్వ విధానాలు, రైతుల కృషి ఫలితంగా దేశ వ్యవసాయ ఎగుమతులు ఏటా రూ. 4 లక్షల కోట్లకు పైగా పెరిగాయని, తద్వారా రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందిందని ప్రధాని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ దేశం అద్భుతమైన ప్రగతిని సాధిస్తోందని చెబుతూ, దేశంలో తేనె ఉత్పత్తి రెట్టింపు అయ్యిందని వివరించారు. పాలు, పప్పుధాన్యాలు, బియ్యం, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని, రైతులు ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడిపై దృష్టి సారించి మరింత లాభాలు గడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

లోకల్ వార్‌లో మంత్రుల...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు...

లోకేష్ వర్సస్ వైసీపీ.....

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా...

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....

పల్నాడు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి....

పారిశ్రామిక రంగంలో గేమ్...

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య...

ఈసీ టార్గెట్ ఆ...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మిగిలిన పట్టణ...

ఏపీ లిక్కర్ స్కాంలో...

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు...

పోల్స్