Monday, November 9, 2026 02:03 PM
Monday, November 9, 2026 02:03 PM

వార్నింగ్ బెల్.. బీ కేర్ ఫుల్..!

2024 ఎన్నికలకు ముందు పరిస్థితి వేరు.. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి వేరు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. రెండు పార్టీలకు కలిపి కేవలం 24 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయారు. ఇంక అంతే.. రెండు పార్టీల దుకాణం క్లోజ్ అని వైసీపీ నేతలు తెగ సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే వైసీపీ ఏకపక్షం. కనీసం ఒక్కటంటే ఒక్క జిల్లా పరిషత్ కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అన్నీ వైసీపీ సొంతం చేసుకుంది. మునిసిపల్ ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. అన్ని మేయర్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

Also Read : మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!

151 సీట్లు గెలిచిన ధీమాతో ఉన్న వైసీపీ అధినేత.. వై నాట్ 175 అన్నారు. సిద్ధం అన్నారు.. మరో 30 ఏళ్లు అధికారం మాదే అన్నారు. కానీ తీరా ఎన్నికల్లో అసలు రంగు తేలిపోయింది. 11 సీట్లకే పరిమితం అయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో ముఖం చూపించలేక మకాం కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మార్చేశారు. ఏడాది పాటు ఏపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత ముందు నెలకోసారి.. ఇప్పుడు మాత్రం వారానికోసారి తాడేపల్లికి వచ్చి కనిపిస్తున్నారు. నెలకో ప్రెస్ మీట్‌తో సరిపెడుతున్నారు. పాదయాత్రకు వస్తున్నా.. రెడీగా ఉండడి.. మనదే గెలుపు.. అంటూ తమ పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నూరి పోస్తున్నారు.

2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఏకంగా 164 సీట్లతో ఘన విజయం సాధించాయి. కూటమి సర్కార్ ఏర్పడింది. నిజానికి కూటమి ఘన విజయం అనే మాట కంటే.. వైసీపీ ఘోర పరాజయం అనే మాట సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేయని అరాచకాలు, అవినీతి లేదు. దాడులు, దారుణాలు, హత్యలు, ఇసుక, మద్యం.. ఇలా లెక్కలేనన్ని. ఇవన్నీ ప్రజలను కూటమి వైపు అడుగులు వేసేలా చేశాయి. అందుకే 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో గెలిపించిన వైసీపీని సరిగ్గా ఐదేళ్లకే 2024 నాటికి 11 స్థానాలకు పరిమితం చేసింది ఓటర్లే.

Also Read: క్యాన్సర్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్..!

కూటమి సర్కార్ గెలిచిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ నేతలు మాధవ్ సహా కూటమి నేతలంతా పదే పదే చెబుతున్న మాట. ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమంటున్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమికి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. పైకి మాత్రం.. గెలిచామని చెప్పుకుంటున్నప్పటికీ.. లోపల మాత్రం ఓటమి భయం వెంటాడుతున్నట్లు సమాచారం. పులివెందులలో గెలిచాం.. అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు.. అనంతలో ఓడిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గణనీయమైన ఓటు బ్యాంకు సాధించింది. 2021 లోకల్ బాడీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. కానీ.. వైసీపీ మాత్రం ధైర్యంగా నిలబడటం.. ఓటర్లను ఆలోచించేలా చేసింది. నామినేషన్ల సమయంలో దాడులు, అక్రమాలు అంటూ వైసీపీ చేసిన ప్రచారం బాగా వర్కవుట్ అయ్యింది. అదే సమయంలో కూటమి రెండున్నర సంవత్సరాల పాలనకు కూడా ఓటర్లు ఓటుతో మార్కులు వేశారు. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా షాక్ ఇచ్చారు. కళా వెంకట్రావు కోడలు, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి సీతానగరం జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 40 స్థానాల్లో టీడీపీ ఓడిపోతే.. అందులో 17 స్థానాలు సంతనూతలపాడు నియోజకవర్గంలోనే ఉన్నాయి. టీడీపీ కంచుకోట గన్నవరం జెడ్పీటీసీ వైసీపీ గెలుచుకుంది.

Also Read: ప్రాదేశిక పోరులో కూటమి దూకుడు.. కానీ..!

కూటమి బలహీనత గ్రామాల్లో బయటపడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ ఉండే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని.. గ్రామీణ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంది. మ స్థాయిలో వైసీపీ కేడర్ యాక్టివేట్ అయ్యింది. పైగా ఓటర్లలో ఒక మాట బాగా వినిపిస్తోంది. మునిసిపాలిటీల్లో నామినేషన్లు అడ్డుకున్నారు.. కాబట్టే అక్కడ గెలిచారు.. అదే అక్కడ కూడా ఓటింగ్ జరిగి ఉంటే.. ఫలితాలు ఎలా ఉండేవో.. అనే మాట వినిపిస్తోంది. ఇప్పటి కైనా జాగ్రత్త పడకపోతే చేయదాటిపోతుందని హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు వార్నింగ్ బెల్ మోగించారు. ఇప్పటికైనా కూటమి నేతలు జాగ్రత్త పడకపోతే.. ఫలితం చాలా దారుణంగా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ట్రేడింగ్ విండోలో గుజరాత్...

ఐపీఎల్ 2027 వేలానికి ముందే ఫ్రాంచైజీల...

ఓట్ల శాతం, సీట్ల...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై...

మిడ్‌టర్మ్ ఎన్నికల ఓటమిపై...

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ...

ఏపీలో మరో ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ...

క్యాన్సర్ రోగులకు కేంద్రం...

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న బాధితులకు కేంద్ర...

మాజీలకు షాక్.. ఎందుకిలా..?

విజయనగరం జిల్లాలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్...

పోల్స్