జగన్ ఎంత నటోరియస్సో చాలా సందర్భాల్లో జనానికి తెలిసొచ్చింది. తన అవినీతి, అధికార, అహంకారానికి ఏమాత్రం భంగం వాటిల్లినా సహించలేడు. ఇది నియంతలలో ఉండే సర్వసాధారణ లక్షణం. అవినాశ్ రెడ్డికి సీటు ఇవ్వొద్దు, తనకైనా, సొంత చెల్లెలు షర్మిలకైనా ఇవ్వాలన్నాడని సొంత బాబాయ్ అని కూడా చూడకుండా వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా లేపేసిన చరిత్ర అబ్బాయిది. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో ఉంటే, పాదయాత్ర చేసి వైకాపాకి అండగా నిలిచి పార్టీని నిలబెట్టింది చెల్లెలు షర్మిల. అన్నకి అధికారం దక్కాలని రాష్ట్రమంతా పర్యటించింది. అధికారం దక్కిన వెంటనే షర్మిలకి తాడేపల్లి ప్యాలెస్ తలుపులు మూసుకుపోయాయి. చివరికి ఇవ్వాల్సిన ఆస్తి వాటా కూడా ఇవ్వలేదు. ఇక్కడుంటే బాబాయ్‌లాగే తానూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలంగాణకి తరలిపోయింది. చెల్లెలుకి ఆస్తి పంపకం చేయాలని కోరిందని తల్లి విజయమ్మని కూడా తరిమేశాడు.
క్రిస్మస్ సందర్భంగా దయాగుణం కలిగి ఉండాలని పిలుపునిచ్చిన జగన్, తాను మాత్రం సొంత చెల్లెలు ఏ తప్పు చేయకపోయినా కక్ష కట్టి క్రిస్మస్ రోజు షర్మిలని బండబూతులు తిట్టించాడు. క్రిస్మస్ రోజు ఏ అన్నా తన చెల్లెలికి చేయని ఘోర అవమానం షర్మిలకి జగన్ చేశాడు. ఆమె చేసిన నేరం ఏంటో తెలుసా? ్రకిస్మస్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నేతలకు పంపినట్టే నారా లోకేష్‌కి కూడా గిఫ్ట్ ప్యాక్ పంపి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసింది. తమకి క్రిస్మస్ కానుక పంపినందుకు షర్మిలకి థ్యాంక్స్ చెబుతూ నారా లోకేష్ ట్వీటేశారు. ఇదే ఆమె చేసిన నేరమట. షర్మిల కష్టంపై నిర్మించిన వైకాపాలో చోటివ్వలేదు, కడప ఎంపీ సీటు ఇవ్వలేదు. రాజ్యసభ ఇస్తారని ఎదురుచూస్తే..తన తండ్రిని చంపారని ఆరోపించిన రిలయన్స్ వాళ్లకే ఇచ్చేశాడు. చివరికి ఆస్తిలో కూడా వాటా ఇవ్వను పొమ్మన్న ఏ అన్నకైనా చెల్లెలు రాఖీ కడుతుందా? ఆస్తి అడిగితే చంపుతానని వార్నింగ్ ఇచ్చిన ఏ సోదరుడికైనా సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతుందా? ్రకీస్తుని నమ్ముకున్న షర్మిల ఆ దయామయుడి పుట్టినరోజైన క్రిస్మస్ రోజే బజారు మనిషి శ్రీరెడ్డితో తిట్టించిన జగన్ రెడ్డి దుర్మార్గ దుష్ట ప్రవర్తనని చూసి వైఎస్ అభిమానులే ఛీకొడుతున్నారు.