Monday, October 26, 2026 05:33 PM
Monday, October 26, 2026 05:33 PM

అతను మరో రహానే.. సౌతాఫ్రికా కెప్టెన్‌పై గవాస్కర్ ప్రశంసల జల్లు..!

ఆస్ట్రేలియాతో గెబెర్హా వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన దక్షిణాఫ్రికా సారథి టెంబా బవుమాపై క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. ఒకానొక దశలో సౌతాఫ్రికా 110 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన తరుణంలో, బవుమా 179 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ తర్వాత భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన తాజా కాలమ్‌లో బవుమా నాయకత్వాన్ని, ఆటతీరును ప్రత్యేకంగా కొనియాడారు. బవుమా మైదానంలో ప్రవర్తించే తీరును భారత మాజీ ఆటగాళ్లు అజింక్యా రహానే, గుండప్ప విశ్వనాథ్‌లతో పోల్చారు.

Also Read : తాడిపత్రిలో పీక్‌కు చేరిన పొలిటికల్ హీట్..!

“టెంబా బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా జట్టు ఆడిన 14 టెస్టుల్లో 12 మ్యాచ్‌లు గెలిచింది. ఒక సిరీస్‌లో కేవలం మొదటి మ్యాచ్ మాత్రమే ఓడిపోయే అలవాటు ఉన్న బవుమా రికార్డు.. అజింక్యా రహానే టెస్ట్ రికార్డును తలపిస్తోంది” అని గవాస్కర్ పేర్కొన్నారు. రహానే కెప్టెన్సీలో కూడా భారత్ ఎప్పుడూ టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “వీరిద్దరిలోనూ ఒక సాదృశ్యం ఉంది. ఇద్దరూ మైదానంలో అనవసరంగా ఛాతి చరుచుకుంటూ హంగామా చేయరు. అలాగే తాము ఎంత గొప్ప వాళ్ళమో ప్రపంచానికి చాటిచెప్పడానికి వీరి వెనుక ఎలాంటి పీఆర్ సైన్యాలు లేవు” అంటూ గవాస్కర్ నేటి తరం పీఆర్ ట్రెండ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు.

Also Read : తెలంగాణా బీజేపిలో ఏం జరుగుతోంది..?

బవుమా మైదానంలో ఎంతో నిశ్శబ్దంగా, హుందాగా కనిపిస్తాడని.. అది తనకు తన మాజీ సహచరుడు గుండప్ప విశ్వనాథ్‌ను గుర్తుకు తెస్తుందని గవాస్కర్ అన్నారు. ఒక కఠినమైన క్రికెటర్‌గా నిలబడటానికి మైదానంలో తిట్టాల్సిన అవసరం లేదని, కోపతాపాలు ప్రదర్శించకుండానే అద్భుతంగా రాణించవచ్చని బవుమా నిరూపిస్తున్నాడని ప్రశంసించారు. గతంలో కోటా పద్ధతి ద్వారానే బవుమా జట్టులోకి వచ్చాడంటూ విమర్శలు చేసిన వారు.. ఇప్పుడు ఆయన ప్రదర్శన చూసి నోరు మూసుకోవాల్సి వస్తోందని గవాస్కర్ తన వ్యాసంలో స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

మళ్లీ.. బొత్స వర్సెస్...

2024 అసెంబ్లీ ఎన్నికలు అందరికీ గుర్తే....

పోస్టల్ బ్యాలెట్లపై ఎస్‌ఈసీ...

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల...

తెలంగాణా బీజేపిలో ఏం...

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అగ్ర నాయకత్వం...

దూసుకొస్తున్న అర్నాబ్.. కోస్తాంధ్రకు...

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్...

కడపలో స్టోరీ క్లోజ్..?...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, నగర పంచాయతీ చైర్‌పర్సన్...

విడదల రజినికి ఊహించని...

ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల...

పోల్స్