Monday, September 28, 2026 06:33 PM
Monday, September 28, 2026 06:33 PM

అల్లు శిరీష్: ఒక్క ఫిర్యాదుతో రాజకీయ దుమారం

హైదరాబాద్‌లోని వినోబా నగర్‌ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి వేళల్లో భారీ శబ్దంతో సంగీతం వినిపిస్తోందంటూ సినీ నటుడు అల్లు శిరీష్ హైదరాబాద్ సిటీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌లో నివసిస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా ఆలయం వద్ద అనుమతించిన శబ్ద పరిమితికి మించి రాత్రి 2–3 గంటల వరకు భారీ సౌండ్ తో డీజే పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోషల్ మీడియాలో ఆరోపించారు.

Also Read : అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన ముంబై హోటల్ రాత..!

ఈ విషయమై ఇప్పటికే ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు శిరీష్ తెలిపారు. గణేశ్ నిమజ్జనం కార్యక్రమాల నేపథ్యంలో సెప్టెంబర్ 25 వరకు సహకరించాలని పోలీసులు సూచించారని, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా శబ్దం కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. తమ సొసైటీలోని వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు రాత్రి వేళల్లో ఈ శబ్దం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శిరీష్ తెలిపారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులను కోరారు.

Allu Sirish Complaint On Loud DJ

ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చ మొదలైంది. మతపరమైన కార్యక్రమాలు, పండుగల సందర్భంగా భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూనే.. శబ్ద కాలుష్య నిబంధనలు, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుపై రాజకీయ చర్చ కూడా తలెత్తడంతో శిరీష్ మరో పోస్ట్‌లో తన ఉద్దేశాన్ని వివరించారు. తనకు మతంపై విశ్వాసం ఉందని, హనుమంతుడిని పూజిస్తానని చెప్పారు. అయితే అర్ధరాత్రి 2 గంటల వరకు, ఆ తరువాత పెద్ద శబ్దంతో డీజే సంగీతం వినిపించడం భక్తి కాదని, తన ఫిర్యాదు భక్తికి వ్యతిరేకంగా కాకుండా ఇతరులకు కలుగుతున్న ఇబ్బందుల గురించేనని స్పష్టం చేశారు.

Also Read : ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ పాలనకు రిఫరెండమా..?

ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆలయం వద్ద సంగీతానికి సంబంధించిన అనుమతులు, సమయాలు, శబ్ద పరిమితులు పాటిస్తున్నారా అనే అంశాలను అధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

తెనాలి మాజీ ఎమ్మెల్యే...

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

పోల్స్