Monday, September 28, 2026 01:20 PM
Monday, September 28, 2026 01:20 PM

తెనాలి మాజీ ఎమ్మెల్యే గారి చీటింగ్ లీలలు..!

గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఆయన భార్య అన్నాబత్తుని పుష్ప డైరెక్టర్‌గా ఉన్న ఏపీజే ఇంప్లెక్స్ కంపెనీ కోసం విజయవాడకు చెందిన ఐకేఎఫ్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.3 కోట్ల భారీ రుణం పొంది, ఆ తర్వాత తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రుణం చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో రికవరీ ప్రక్రియ ప్రారంభించిన సదరు సంస్థకు, తాకట్టు పెట్టిన ఆస్తుల వ్యవహారంలో పెద్ద మోసం జరిగినట్లు వెల్లడైంది.

Also Read : విజయవాడ ధర్నా చౌక్ హైడ్రామా.. సీఐ మృతి కేసులో సంచలనం..!

ఫిర్యాదు వివరాల ప్రకారం… 2019లో శివకుమార్ తెనాలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ రుణం తీసుకున్నారు. ఇందుకోసం తెనాలిలోని 1,200 గజాల విలువైన స్థలాన్ని ఫైనాన్స్ సంస్థ వద్ద తాకట్టు పెట్టి రిజిస్ట్రేషన్ రికార్డులను సమర్పించారు. అయితే, సదరు స్థలంలో దాదాపు 500 గజాల భూమిని ఫైనాన్స్ సంస్థకు తాకట్టు పెట్టడానికంటే ముందే ఆయన ఇతరులకు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం శివకుమార్ పేరిట కేవలం 700 గజాల స్థలం మాత్రమే ఉండగా, రిజిస్ట్రేషన్ పత్రాలలో మాత్రం ఇంకా 1,200 గజాలు ఉన్నట్లు చూపించి ఫైనాన్స్ కంపెనీని బురిడీ కొట్టించారని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read : మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ బంపర్ ఆఫర్..!

తాను అప్పట్లో అనుభవించిన ఎమ్మెల్యే హోదాను, అధికార బలమిని వాడుకుని రిజిస్ట్రేషన్ రికార్డుల విషయంలో తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటారని ఫైనాన్స్ ప్రతినిధులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫైనాన్స్ సంస్థ ఇచ్చిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం తెనాలి వన్‌టౌన్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో పాటు ఆయన భార్య పుష్ప, తూనుగుంట్ల శ్రీనివాస శివరామ్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆర్థిక మోసం నియోజకవర్గ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెద్దల సభకు రాజకీయ...

తెలంగాణలో మరో కీలక రాజకీయ సమరానికి...

విజయవాడ ధర్నా చౌక్...

విజయవాడ ధర్నా చౌక్ వద్ద సచివాలయ...

మొబైల్ వినియోగదారులకు ట్రాయ్...

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో...

త్రిముఖ పోటీ ఖాయమేనా..?

ఖైరతాబాద్ గణేష్ గంగమ్మ ఒడికి చేరాడు....

జగన్ మునిగితే తాను...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం వైఎస్...

సరస్ మేళా :...

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు...

పోల్స్