Friday, September 25, 2026 07:51 PM
Friday, September 25, 2026 07:51 PM

పార్టీ అధ్యక్షుడి కంటే పెద్ద సారూ.. విజయసాయి రెడ్డి సంచలనం..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య చిగురిస్తున్న సరికొత్త పొత్తుల సమీకరణాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. తాడేపల్లి వేదికగా ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేయడానికి వైసీపీ నిర్ణయించుకుందంటూ సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆయన పరోక్షంగా వైసీపీ కీలక నేతను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు.

Also Read : ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్ రికార్డ్..!

విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో.. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐతో కలిసి ఉమ్మడి పోరాటాలు చేయాలనే వ్యూహం వెనుక ఒక కీలక నాయకుడి హస్తం ఉందనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. “పార్టీ అధ్యక్షుడి కన్నా ఎత్తైన కుర్చీలో కూర్చున్న ఆ సార్ గారు.. తన మాజీ పార్టీతో జరిపించిన ఈ ఒప్పందం వల్ల పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి వైసీపీ శ్రేణులే ఆలోచించుకోవాలి” అంటూ ఆయన హెచ్చరించారు. పేరు ఎత్తకుండానే వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.

Also Read : వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ..!

ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ నేతలు కలవడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై చర్చలు జరిపారు అనే వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ అగ్ర నాయకత్వాన్ని పక్కనబెట్టి తెరవెనుక ఒక కోటరీ మాత్రమే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అసంతృప్తిని విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా బహిర్గతం చేశారనే మాట వినపడుతోంది. ఒకప్పుడు పార్టీలో నంబర్-2 గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు వరుస బాంబులు పేల్చడం సంచలనంగా మారింది. ఈ నయా ట్వీట్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో వైసీపీలో మరిన్ని పొలిటికల్ ప్రకంపనలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పవన్-రాధా భేటీ వెనుక...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్