Saturday, September 26, 2026 12:07 AM
Saturday, September 26, 2026 12:07 AM

గుండె పోటు కాదు.. సజ్జల కొత్త డ్రామా..!

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. మృతిపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయటం లేదు. కానీ వైసీపీ అగ్రనేతలు.. మాత్రం ఈ సాధారణ చావును కూడా రాజకీయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గుండెపోటుకు కూడా హత్య అనే రంగు పులిమేందుకు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. తప్పు జరిగిందంటున్నారు.. కానీ విచారణ వద్దంటున్నారు. హత్య చేశారని ఆరోపిస్తున్నారు.. కానీ కేసులు పెట్టారంట. నరం లేని నాలుక ఏమైనా అనగలదు.. అనే మాటను వైసీపీ అగ్రనేతలు అక్షర సత్యమని నిరూపిస్తున్నారు. ఇందుకు తాజాగా ఆ పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ.

Also Read : ఐటీసీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.. కారణం..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కాకమాను రాజశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఒంగోలు తరలించారు కుటుంబ సభ్యులు. కాకుమాను మృతిపై వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికీ పూడ్చలేనిదని జగన్ ట్వీట్ చేశారు. అంతే తప్ప కాకుమాను మృతి పై జగన్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు.

అయితే కాకుమాను రాజశేఖర్ మృతి చెందిన 24 గంటల తర్వాత ఒంగోలులో ఆయన మృతదేహానికి నివాళి అర్పించిన వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల.. ఇప్పుడు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. కాకుమాను రాజశేఖర్‌ను కూటమి ప్రభుత్వం హత్య చేసిందని.. ఆయన గుండెపోటుకు పోలీసుల వేధింపులే కారణమన్నారు. విజయవాడలో శాప్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆయనపై దాడి చేశారని.. ఛాతిపై బలంగా గుద్దారని.. ఆ ఒత్తిడి వల్లే చనిపోయినట్లు ఆరోపించారు. తోపులాటలో కిందపడేసి ఛాతిపై బలంగా నొక్కారని.. విచిత్రమైన ఆరోపణలు చేశారు. నిజానికి సజ్జల ఒక సీనియర్ పాత్రికేయులు. ఎన్నో వేల వార్తలను రాసి ఉంటారు. వైద్యం గురించి, గుండె పోటు గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన కూడా ఉంటుంది. ఛాతి మీద ఎవరైనా బలంగా నొక్కితే.. ఆ వ్యక్తికి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. తోపులాటలో ఏమైనా జరిగి ఉంటే.. కాకుమాను ఆ పక్కనే ఉన్న ఆసుపత్రికి వెళ్లే వారు. కానీ తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి.. అక్కడ పెద్దలను కలిసిన తర్వాత.. రాత్రికి హైదరాబాద్ వెళ్లారు.

Also Read : పవన్-రాధా భేటీ వెనుక టీడీపీ మాస్టర్ ప్లాన్..?

ఇక ఛాతిలో నొప్పి వస్తే.. ముందుగానే కాకుమాను రాజశేఖర్ ఆసుపత్రికి వెళ్లేవారు. సడన్ హార్ట్ ఎటాక్‌ వల్లే కాకుమాను చనిపోయినట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. అయినా సరే.. ఒత్తిడి వల్ల, నొక్కడం వల్ల.. తోపులాట వల్ల, వేధింపుల వల్ల.. అంటూ సజ్జల ఇప్పుడు పిట్ట కథలు చెబుతున్నారు. నిజానికి వైసీపీ నేతలకు గుండెపోటుకు, గొడ్డలి పోటుకు తేడా తెలియదనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్ సొంత బాబాయ్ గొడ్డలి పోటు వల్ల హత్యకు గురైతే.. ఆయన గుండెపోటు వల్లే చనిపోయారని ముందు ప్రచారం చేశారు. ఆ తర్వాత కాదు కాదు అది గొడ్డలి పోటు.. నారా వారి రక్తచరిత్ర అంటూ మాట మార్చేశారు. ఇప్పుడు కూడా గుండెపోటును కూటమి సర్కార్ ఒత్తిడి, పోలీసులే హత్య చేశారంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు సజ్జల. మరి కాకుమాను మృతిపై విచారణ కోరతారా అంటే.. అబ్బెబ్బే.. అదేం లేదంటున్నారు. పోనీ కేసు పెడతారా అంటే.. వద్దు వద్దు.. అవసరం లేదంటున్నారు. విచారణ వద్దంట.. కేసు కూడా వద్దంటా.. కానీ అనుమానాలున్నాయంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన.. వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

మజ్లీస్ నుంచి దానం...

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ...

పవన్-రాధా భేటీ వెనుక...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్