Friday, September 25, 2026 09:30 PM
Friday, September 25, 2026 09:30 PM

మజ్లీస్ నుంచి దానం పోటీ..?

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ముందస్తు పొలిటికల్ హీట్‌ను భారీగా పెంచేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ అర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు దాదాపు ఖరారైంది. ఈ స్థానానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

Also Read : భారత్-పాక్ రచ్చపై అమెరికా సంచలన కామెంట్స్..!

దానం నాగేందర్ తదుపరి పొలిటికల్ మూవ్ ఏంటనే దానిపై గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సంచలన చర్చ మొదలైంది. పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దానం నాగేందర్ ఈసారి కాంగ్రెస్ లేదా బిఆర్ఎస్ కాకుండా ఊహించని విధంగా మజ్లీస్ పార్టీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉందనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటం, దానికి తోడు దానం నాగేందర్‌కు ఉన్న వ్యక్తిగత క్యాడర్ బలం తోడైతే విజయం సులువవుతుందనేది ఈ సరికొత్త ప్లాన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది.

Also Read : బ్రేకింగ్: ఎన్నికల కమీషనర్ పై కాక్రోచ్ గురి..!

గ్రేటర్ పరిధిలో బలమైన పట్టున్న దానం, మజ్లీస్ పార్టీ వైపు మొగ్గు చూపడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో భేటీ అయి ఇక్కడి వ్యూహాలపై చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలు టికెట్ రేసులో ఉన్నారు. దానం నాగేందర్ గనుక మజ్లీస్ పార్టీ వైపు వెళితే, ఖైరతాబాద్ పోరు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య ఊహించని చతుర్ముఖ పోటీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: కాకినాడ జిల్లాలో...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

పార్టీ అధ్యక్షుడి కంటే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,...

ఫిరాయింపులలో తెలంగాణా వరస్ట్...

భారత రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై...

వరద ఉధృతిలో చిక్కుకున్నటీడీపీ...

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా...

గుండె పోటు కాదు.....

చనిపోయింది గుండెపోటుతో.. ఈ విషయాన్ని వైద్యులు...

పవన్-రాధా భేటీ వెనుక...

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్...

పోల్స్