Thursday, September 24, 2026 05:17 PM
Thursday, September 24, 2026 05:17 PM

మిమ్మల్ని రష్యా వాడుకుంటుంది.. భారత్ కు ఉక్రెయిన్ వార్నింగ్..!

ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ అసెంబ్లీ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రపంచ దేశాల ముందు సంచలన ఆరోపణలు చేశారు. రష్యా తన స్వార్థం కోసం, ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో అంతర్జాతీయ పౌరులను బలవంతంగా వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. రష్యాకు ఉద్యోగాలు లేదా ఇతర మాయమాటలు చెప్పి తీసుకెళ్లి, అక్కడ మోసపూరితమైన ట్రిక్స్ ప్లే చేసి వారిని యుద్ధభూమిలోకి నెడుతున్నారని జెలెన్స్కీ తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలోనే భారత్ తో పాటు మరో 46 దేశాల ప్రతినిధులను ఉద్దేశించి “మీ పౌరులను కాపాడుకోండి.. పుతిన్ మిమ్మల్ని ఈ యుద్ధంలోకి లాగకుండా చూసుకోండి” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read : శీనన్న.. ఇలా అడ్డంగా బుక్ అయ్యావేందన్నా..!

రష్యా రష్యన్లు కాని ఇతర దేశాల ప్రజలను యుద్ధరంగంలో బలితీసుకుంటోందని, ఇందులో భారత్, నేపాల్, ఘనా, తజికిస్తాన్, యెమెన్, కెన్యా వంటి మొత్తం 47 దేశాల పౌరులు ఉన్నారని జెలెన్స్కీ స్పష్టం చేశారు. పుతిన్‌కు అందుతున్న ఆర్థిక వనరులను, రష్యా ఉత్పత్తిని అడ్డుకుంటేనే ఈ క్రూరమైన యుద్ధాన్ని ఆపగలమని, అందుకే తాము రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతేకాకుండా, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైతం రష్యాకు మద్దతుగా తమ సైనికులను యుద్ధంలోకి పంపించారని, దానికి ప్రతిఫలంగా రష్యా నుండి బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్ టెక్నాలజీని పొందుతున్నారని జెలెన్స్కీ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

Also Read : కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి దూల..!

జెలెన్స్కీ ఆరోపణల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన అధికారిక లెక్కలు ఈ సమస్య యొక్క తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 227 మంది భారతీయ పౌరులు రష్యా సాయుధ దళాలలో చేరినట్లు కేంద్రం తెలిపింది. భారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం జరిపిన చర్చల ఫలితంగా ఇప్పటివరకు 139 మంది భారతీయులు రష్యా సైన్యం నుండి సురక్షితంగా విముక్తి పొంది స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడించింది. అయితే, ఈ యుద్ధ వాతావరణంలో చిక్కుకుని దురదృష్టవశాత్తూ ఇప్పటివరకు 51 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే నోటి...

ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు...

పల్నాడులో వైసీపీ...

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో...

భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!

విజయవాడ నుంచి భోగాపురం బయలుదేరిన ఎయిర్...

టీచర్లను కొట్టినా 24...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ...

పిఠాపురంలో పవన్ మార్క్.....

పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఉప...

శీనన్న.. ఇలా అడ్డంగా...

తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి....

పోల్స్