ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏ మాత్రం నచ్చటం లేదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు.. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అదే సామాజిక వర్గం నేతలకు కూడా చంద్రబాబు అంటే ఎందుకు అంత అక్కసు అనేది ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి 12 ఏళ్లు దాటింది. అయినా సరే.. ఇప్పటికీ చంద్రబాబును ముఖ్యమంత్రి కుర్చీలో ఒక సామాజిక వర్గం నేతలు చూడటానికి ఇష్టం చూపించడం లేదు. చివరికి పదవులు పొందిన తెలంగాణ నేతలు కూడా అదే స్థాయిలో అక్కసు వెళ్లగక్కుతున్నారు.
Also Read : పల్నాడులో వైసీపీ మార్క్ దోపిడీ.. విచారణలో సంచలన నిజాలు..!
ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండటాన్ని తెలంగాణ రెడ్లు జీర్ణించుకోలేక పోతున్నారనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే ఉండాలని, చంద్రబాబు ఉండకూడదని కుల గజ్జి, కులం పిచ్చితో పాటు, కమ్మ కులం అంటే వ్యతిరేకతను తెలంగాణ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు, ఆ కులం నాయకులకు నరనరాన జీర్ణించుకు పోయినట్లు పరిస్థితి కనిపిస్తోంది. అందుకేనేమో చంద్రబాబు పైన అకారణంగా, అన్యాయంగా తెలంగాణ రెడ్లు ఆడిపోసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జడ్చెర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బరి తెగించి మరీ చంద్రబాబు పైన నోరు పారేసుకున్నారు.
నిజానికి అనిరుధ్ రెడ్డికి రాజకీయ అనుభవం చాలా తక్కువ. కానీ ఆవేశం మాత్రం చాలా ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలే. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం ఎలాంటి విభేదాలు లేవు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నిహితంగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించింది కూడా. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా తెలుసు. అయినా సరే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అనిరుధ్ రెడ్డి పనిగట్టుకుని మరీ చంద్రబాబు పైన నోరు పారేసుకోవడం పెద్ద దుమారం రేపుతోంది.
అనవసరంగా, సందర్భం కాకపోయినా కూడా పక్క రాష్ట్రం ప్రజలను రెచ్చగొట్టడానికే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ క్యాడర్‌ను అవమానించే విధంగా అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనేది వాస్తవం. టీడీపీ అభిమానులు అందరు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు అనిరుధ్ అవివేక రాజకీయ అపరిపక్వత తప్ప మరొకటి కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read : భోగాపురంలో కంగారుపెట్టిన విమానం..!
కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కోనసీమలో ఏదో మాట్లాడాడని రచ్చ చేసిన నాయకులు.. ఇప్పుడు అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారనేది ఆసక్తి రేపుతున్న అంశం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్న మాట వాస్తవం. అయితే వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదైంది. కానీ అనిరుధ్ రెడ్డి మాత్రం.. చంద్రబాబు కారణంగానే తెలంగాణలో కూడా వర్షాలు పడటం లేదని మాట్లాడటం.. ఆయన అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇంకా చెప్పాలంటే.. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకే నష్టం చేసి.. మరొకరి కళ్లల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నట్లు… తెర వెనుక ఎవరి కోసమో పని చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సి ఉంది. లేకుంటే రాబోయే రోజుల్లో అందుకు భారీ మూల్యం కాంగ్రెస్ పార్టీయే చెల్లించుకోక తప్పదని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

