Wednesday, September 23, 2026 04:47 PM
Wednesday, September 23, 2026 04:47 PM

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసేందుకు, పట్టణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ కోసం రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాలను కేంద్రాలుగా చేసుకుని నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త కమిషనరేట్ల ఏర్పాటుతో ఆయా నగరాల్లో పోలీస్ పరిపాలన మరింత బలోపేతం కానుంది.

Also Read : ఏపీలో గర్భిణీలకు తీపి కబురు..!

దీనితో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,548.98 కోట్ల భారీ బడ్జెట్‌తో అభివృద్ధి పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనీస యాన్యుటీ చెల్లింపు నిబంధనలను సవరించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సవరణల ద్వారా ఎకరా కంటే తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు కూడా కనీస కౌలు మొత్తం లభించేలా నిబంధనలను మార్చారు.

Also Read : అభిషేక్ శర్మ పేరిట చెత్త రికార్డు..!

అమరావతి కోసం త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ నిర్ణయం ద్వారా కల్పించారు. అలాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ మరియు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో, గ్రామీణ ప్రగతిని పరుగులు పెట్టించేలా కేబినెట్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు భారీ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ యూనిట్‌కు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను మంజూరు చేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీ పోలీసులకు జగన్...

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల...

బ్రేకింగ్: విజయసాయి రెడ్డి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన...

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

పోల్స్