Wednesday, September 23, 2026 03:07 PM
Wednesday, September 23, 2026 03:07 PM

సిఎం మెడకు చుట్టుకున్న చిల్లర గాళ్ళ రచ్చ..!

బీహార్‌లోని జమయి జిల్లాలో పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై రాత్రి వేళ రోడ్డుపై జరిగిన అమానుష దాడి, వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి, విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి గతంలో ఒక ప్రముఖ హిందీ న్యూస్ ఛానెల్ చర్చా కార్యక్రమంలో మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!

రాష్ట్రంలో మహిళలను ఎవరైనా కనీసం తాకినా సరే తాను వెంటనే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆ వీడియోలో ఆయన సవాల్ చేయడం గమనార్హం. ప్రస్తుతం జమయిలో ఇంతటి దారుణం జరిగినా ముఖ్యమంత్రి ఇంకా ఎందుకు పదవిలో కొనసాగుతున్నారని, నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also Read : ఎవడు ఆపినా ఎన్నికలు ఆగవు: లోకేష్

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్‌లు, పోలీసుల అరాచకాలు పెరిగిపోతున్నాయని, హోంశాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి వీటన్నింటికీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలు కఠిన చర్యలు తీసుకోవడం పక్కన పెట్టి, వాస్తవాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే సీతమార్హిలో జరిగిన కాల్పులు, అలాగే జూన్ నెలలో భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన భరత్ తివారీ ఫేక్ ఎన్‌కౌంటర్ ఉదంతాలను ప్రస్తావిస్తూ బీహార్‌లో అసలు చట్టం అనేదే లేకుండా పోయిందని విమర్శించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో గర్భిణీలకు తీపి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను...

ఎవడు ఆపినా ఎన్నికలు...

ఏపీ కేబినేట్ భేటీ సందర్భంగా మంత్రులతో...

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

పోల్స్