Monday, September 21, 2026 08:12 PM
Monday, September 21, 2026 08:12 PM

వైసీపీ నేతల చూపు.. టీడీపీ వైపే..!

వైసీపీ నుంచి వలసల జోరు పెరుగుతున్న వేళ.. కూటమిలో టీడీపీకి కొత్త నేతలు క్యూ కడుతుంటే జనసేన మాత్రం ఆ స్థాయిలో వలసలను ఆకర్షించలేక పోతోందన్న చర్చ మొదలైంది. అధికార పార్టీగా టీడీపీకి ఉన్న సంస్థాగత బలం ఒక కారణమైతే.. జనసేనలో చేరిన తర్వాత తమ రాజకీయ ప్రాధాన్యత ఎలా ఉంటుందన్న సందేహం మరో కారణంగా కనిపిస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న నేతలు అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లోకి చేరేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Also Read : సాప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. టీచర్లపై వైసీపీ దాడి..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతల వలసలు కొనసాగుతున్న వేళ.. కూటమిలోని రెండు ప్రధాన రాజకీయ వేదికల్లో ఒకటైన జనసేన కంటే తెలుగుదేశం పార్టీ వైపే ఎక్కువ మంది సీనియర్ నేతలు మొగ్గు చూపుతున్నారన్న _చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. విజయనగరం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీలో చేరడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. ప్రతిపక్షం నుంచి బయటకు వస్తున్న నేతలకు కూటమిలో రెండు రాజకీయ వేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎక్కువ మంది టీడీపీ వైపు ఎందుకు అడుగులు వేస్తున్నారు? జనసేన వైపు ఎందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ నుంచి బయటకు వస్తున్న నేతలకు టీడీపీ ఒక పాత, విస్తృతమైన రాజకీయ వ్యవస్థగా కనిపిస్తోందన్నది మరో విశ్లేషణ. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే ఉన్న పార్టీ నిర్మాణం. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కేడర్ వ్యవస్థ, అధికార పార్టీగా ఉన్న ప్రస్తుత రాజకీయ స్థానం.. ఇవన్నీ తమకు తిరిగి రాజకీయ పునాదిని నిర్మించుకోవడానికి ఉపయోగపడతాయని కొందరు నేతలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ యంత్రాంగం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే నేతలు తమ అనుచర వర్గాన్ని కూడా రాజకీయంగా నిలబెట్టుకోవాలంటే ఇప్పటికే విస్తృతంగా ఉన్న సంస్థాగత వ్యవస్థ ఉన్న పార్టీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణ వినిపిస్తోంది.

Also Read : ఇప్పటికీ వారికే పదవులు.. ఎందుకీ నిర్లక్ష్యం..?

ఇదే సమయంలో జనసేనలో చేరాలనుకునే వైసీపీ మాజీ నేతల ముందున్న మరో ప్రశ్న.. తమ రాజకీయ శైలి, గత అనుభవాలు, స్థానిక సమీకరణాలు జనసేన రాజకీయ సంస్కృతిలో ఎంతవరకు ఇమడతాయి..? అనేది. జనసేన తన సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. పార్టీ జాతీయ స్థాయిలోనూ విస్తరించాలనే లక్ష్యాన్ని ప్రకటించినట్లు ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ కొత్తగా వచ్చే సీనియర్ నేతలకు తక్షణ రాజకీయ స్థానం కల్పించడం.. ఇప్పటికే ఉన్న కేడర్‌తో వారిని సమన్వయం చేయడం.. కూటమి భాగస్వామి టీడీపీతో స్థానిక స్థాయిలో సమీకరణాలను నిర్వహించడం.. ఇవన్నీ జనసేన పార్టీకి ప్రత్యేక సవాళ్లుగా కనిపిస్తున్నాయి.

వైసీపీ నుంచి నేతలు బయటకు వస్తున్న పరిణామం జనసేనకు ఒకవైపు అవకాశం, మరోవైపు సవాలు కూడా. వైసీపీకి చెందిన బలమైన నాయకత్వం, స్థానిక నెట్‌వర్క్ ఉన్న నేతలను ఆకర్షిస్తే జనసేనకు నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత బలం పెరగవచ్చు. అదే సమయంలో ప్రతి సీనియర్ నేతను పార్టీలోకి తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కేడర్‌తో సమన్వయం, స్థానిక ఆధిపత్య పోరు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న చేరికల విధానం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి నేతలు బయటకు వస్తున్నారు.. టీడీవీ వారిని ఆహ్వానిస్తోంది.. జనసేన మాత్రం ఎంపిక చేసుకుని అడుగులు వేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు పార్టీల సంస్థాగత బలాబలాలపై ఈ వలసల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ అంశంగా మారింది.

Also Read : సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.. లేదా..?

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చే నేతల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నది కూడా రాజకీయ చర్చలో మరో అంశం. అయితే జనసేన పూర్తిగా చేరికలకు తలుపులు మూసివేసిందని ఆ పార్టీ నేతలు చెప్పడం లేదు. 2026 జూన్‌లో పార్టీ రాష్ట్ర స్థాయి 14 మంది సభ్యుల జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసి, పార్టీ బలోపేతం కోసం చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రకటించారు. అంటే సమస్య ‘చేరికలు లేవు’ అనే దానికంటే.. ఎవరిని చేర్చుకోవాలి? ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్నవారికి అవకాశం ఇవ్వాలి? పార్టీలో ఇప్పటికే ఉన్న కేడర్ తో వారిని ఎలా సమన్వయం చేయాలి? అన్న విధానంలో ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. జనసేనలో దీర్ఘకాలంగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దిశగా పార్టీ వ్యవస్థలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నుంచి బయటకు వస్తున్న సీనియర్ నేతలకు ప్రధానంగా కావాల్సింది రాజకీయ పునరావాసం మాత్రమే కాదు.. తమ నియోజకవర్గాల్లో రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు అవసరమైన స్థానం, వ్యవస్థ, అనుచరగణం. కూటమిలో సమన్వయం. ఇక్కడే జనసేనపై కొందరు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలినేని జనసేనలో చేరిన తర్వాత కూడా ఒంగోలు రాజకీయాల్లో టీడీపీ నేతలతో ఆయనకు బహిరంగ విభేదాలు తలెత్తాయి. బాలినేని, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి వెళ్లడంతో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ జోక్యం చేసుకుని ఇద్దరూ సంయమనం పాటించాలని సూచించింది. ఈ పరిణామాన్ని చూసిన ఇతర పార్టీల సీనియర్ నేతలు.. జనసేనలో చేరిన తర్వాత కూడా స్థానికంగా టీడీపీ నాయకత్వంతో సమన్వయం సవాలుగా మారితే తమ రాజకీయ స్థానం ఏమవుతుందనే లెక్కలు వేసుకుంటున్నారన్న విశ్లేషణ వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ రౌడీషీటర్లకు లోకేష్‌...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో...

హైదరాబాద్‌లోని కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి...

వైసీపీ నేతలపై క్రిమినల్...

విజయవాడ శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ...

ఎర్రవల్లిలో ఊపందుకున్న భూముల...

మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్...

నాతో వస్తావా.. నీకు...

అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ రంగంలో వ్యాపారం చేయాలనుకున్న...

టీవీ9లోకి మళ్ళీ ఎంట్రీ...

తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రజాదరణ...

పోల్స్