Thursday, September 17, 2026 05:04 PM
Thursday, September 17, 2026 05:04 PM

ఏపీ పట్టణాలకు మహర్దశ.. భారీ ప్రాజెక్ట్ లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థలను సమూలంగా ఆధునీకరించేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌–II కింద రాష్ట్రంలో రూ.5,912 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 14 భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆర్థిక శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : వంద శాతం స్ట్రైక్ రేట్.. ఇదే టార్గెట్..!

రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన రీజియన్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను పటిష్ఠం చేయనున్నారు. ఇందులో భాగంగా అమరావతి రీజియన్‌లో 25, తిరుపతి రీజియన్‌లో 23, విశాఖపట్నం రీజియన్‌ పరిధిలో 11 మున్సిపాలిటీలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి వంటి కీలక నగర కార్పొరేషన్లతో పాటు తాడిగడప మున్సిపాలిటీలో తాగునీరు, వరద నీరు, మురుగునీటి డ్రైనేజీల ఆధునీకరణకు ఈ నిధులను భారీగా ఖర్చు చేయనున్నారు.

Also Read : నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?

పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు అధునాతన మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా అందించనుండగా, మిగిలిన 75 శాతం నిధులను మున్సిపల్ సొంత నిధులు, బాండ్లు మరియు బ్యాంక్ రుణాల ద్వారా సమీకరించుకునేందుకు ఆర్థిక శాఖ రాష్ట్ర స్థానిక సంస్థలకు అనుమతినిచ్చింది. ఈ భారీ ప్రాజెక్టులతో ఏపీలోని పట్టణాలు సరికొత్త రూపురేఖలను సంతరించుకోనున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్