Wednesday, September 16, 2026 03:18 PM
Wednesday, September 16, 2026 03:18 PM

నెయిల్ పాలిష్ వల్ల క్యాన్సర్ వస్తుందా..?

మహిళల మేకప్ కిట్‌లో నెయిల్ పాలిష్‌ అనేది చాలా ముఖ్యమైన భాగం. అయితే, నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ అనేక రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. దీనిపై ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ వర్తికా విత్వానీ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా నెయిల్ పాలిష్ నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదని, కానీ అందులో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్, టోలుయిన్, డిపిపి వంటి ప్రమాదకరమైన రసాయనాలు మాత్రం ఆరోగ్యానికి హానికరం అని ఆమె స్పష్టం చేశారు.

Also Read : యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ఆందోళనలకు కేంద్రం చెక్..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫార్మాల్డిహైడ్‌ను క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకునే వారికి దీనివల్ల పెద్దగా ముప్పు ఉండకపోవచ్చు. కానీ, బ్యూటీ సెలూన్లలో ప్రతిరోజూ పనిచేసే సిబ్బంది ఈ రసాయనాల గాలిని నిరంతరం పీల్చడం వల్ల వారికి ముక్కు, గొంతు సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి నెయిల్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : బొత్స కన్నీళ్లు.. లెక్క చేయని జగన్..!

ముఖ్యంగా నెయిల్ పాలిష్ కొనేటప్పుడు బాటిల్‌పై ‘5-Free’ లేదా ’10-Free’ అనే లేబుల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇలాంటి వాటిలో ఫార్మాల్డిహైడ్, టోలుయిన్, కాంఫర్ వంటి హానికర రసాయనాలు ఉండవు. బ్రాండ్ల పేర్లు చూసి మోసపోకుండా, బాటిల్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ లిస్ట్‌ను పూర్తిగా చదివి కెమికల్స్ లేవని నిర్ధారించుకోవాలి. వీలైనంత వరకు సహజసిద్ధమైన పదార్థాలతో తయారయ్యే, ఆర్గానిక్ నెయిల్ పాలిష్‌లను ఎంచుకోవడం గోళ్లకు మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది. గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతరం నెయిల్ పాలిష్ వేసి ఉంచడం అంత మంచిది కాదు.

Also Read : కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!

ఒకసారి నెయిల్ పాలిష్ తీసేసిన తర్వాత, మళ్లీ వేసుకోవడానికి మధ్యలో కనీసం ఒక వారం రోజుల పాటు విరామం ఇవ్వాలి. ఇది గోళ్లు పసుపు రంగులోకి మారకుండా, సహజంగా శ్వాస పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఒకవేళ సెలూన్‌కి వెళ్లి జెల్ మేకప్ లేదా నెయిల్ ఆర్ట్ చేయించుకునే అలవాటు ఉంటే, జెల్ నెయిల్స్ ఆరబెట్టే యూవీ ల్యాంప్స్ కింద చేతులు పెట్టే ముందు తప్పకుండా చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ యూవీ కిరణాలు డీఎన్‌ఏను దెబ్బతీసి స్కిన్ క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయని ల్యాబ్ పరిశోధనల్లో తేలింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

యూపీఐ చార్జీలు.. ఎక్కడ,...

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు...

ఏపీలో ఉద్యోగాల జాతర.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి...

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల...

దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు...

పోల్స్