Wednesday, September 16, 2026 03:41 PM
Wednesday, September 16, 2026 03:41 PM

కేంద్రం ఒత్తిడికి దిగొచ్చిన మెటా.. ఆ కంటెంట్‌పై సంచలన నిర్ణయం..!

సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తీవ్ర ఒత్తిడితో ప్రముఖ టెక్ దిగ్గజం ‘మెటా’ ఎట్టకేలకు దిగొచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చిన్నారులపై జరిగే వేధింపులు, లైంగిక దాడులకు సంబంధించిన ‘చైల్డ్ అబ్యూస్ కేసుల’పై ఉక్కుపాదం మోపేందుకు మెటా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read : బ్రేకింగ్.. నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఇకపై తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి అక్రమ కంటెంట్‌ను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుల వివరాలను నేరుగా పోలీసులకే అప్పగించనుంది. ఇంతకుముందు ఇలాంటి అపరాధ కంటెంట్‌ను కేవలం బ్లాక్ చేయడం లేదా సదరు అకౌంట్లను తొలగించడానికే పరిమితమైన మెటా, ఇకపై రూట్ మార్చింది. సోషల్ మీడియాలో చిన్నారుల రక్షణే ధ్యేయంగా కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.

Also Read : వారణాసి.. ఏం ప్లాన్ చేశావు జక్కన్న..!

ఇలాంటి కేసులకు సంబంధించిన సమాచారాన్ని, డేటాను ఎప్పటికప్పుడు స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు నేరుగా చేరవేసే వ్యవస్థను సిద్ధం చేస్తోంది. దీనివల్ల నేరస్థులను త్వరగా పట్టుకునే అవకాశం పోలీసులకు లభిస్తుంది. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, సోషల్ మీడియా సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మెటా తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నేరాలను అరికట్టడానికి ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వికృత మనస్తత్వాలు ఉన్నవారికి ఈ కొత్త నిబంధన ఒక హెచ్చరిక కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ ఒక్క సీటు...

ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది....

చరిత్రలోనే తొలిసారి.. పవిత్ర...

ఇస్లాం మతస్తుల అత్యంత పవిత్ర నగరమైన...

ఏపీ పట్టణాలకు మహర్దశ.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు,...

యూపీఐ చార్జీలు.. ఎక్కడ,...

డిజిటల్ పేమెంట్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు...

ఏపీలో ఉద్యోగాల జాతర.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ ఉద్యోగార్థులకు కూటమి...

యూపీఐ లావాదేవీలపై ఛార్జీల...

దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై అదనపు ఛార్జీలు...

పోల్స్